Andhra Pradesh: ఆడీ కారులో సాంకేతిక లోపం.. రిపేర్‌కు ఇవ్వగా పోలీసుల ఎంట్రీ.. సినిమాను మించిన ట్విస్టులు..!
స్థానికంగా హీరో అని పిలుస్తుంటారు. హార్బర్ లోని కార్మికులకు గంజాయి విక్రయిస్తుంటాడు. ఖరీదైన కార్లలో తిరుగుతుంటాడు. ఇతనిపై హావాలా కేసులున్నాయి. అయితే గంజాయి వ్యాపారంలో భారీగా లాభాలుంటాయని తెలుసుకున్న వర్గీస్ గత కొంత కాలంగా ఒడిస్సాలో గంజాయి కొని కొచ్చిన్ హార్బర్ కు తరలిస్తున్నాడు. అక్కడ బోట్ల యజమానులకు గంజాయి...

గుంటూరు, ఆగష్టు 03: గంజాయి రవాణాకు ఎల్లలు లేవని తేల్చారు కేరళ చెందిన ఇద్దరు నిందితులు. గుట్టు చప్పుడు కాకుండా ఒడిస్సా నుండి కేరళ వరకూ సాగుతున్న గంజాయి అక్రమ రవాణాకు గుంటూరు పోలీసులు చెక్ పెట్టారు. కారు మారమ్మత్తుల కోసం ఆటో నగర్ వచ్చిన ఇద్దరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు.
కొచ్చిన్ హార్బర్ కే ఎందుకు..
వర్గీస్, సడకతుల్లా ఇద్దరూ కేరళ రాష్ట్రానికి చెందిన వారు. వర్గీస్ కు కొచ్చిన్ హార్బర్ లో 1.5 కోట్ల విలువైన ఓడ ఉంది. ఇతను మకాం కొచ్చిన్ హార్బరే.. స్థానికంగా హీరో అని పిలుస్తుంటారు. హార్బర్ లోని కార్మికులకు గంజాయి విక్రయిస్తుంటాడు. ఖరీదైన కార్లలో తిరుగుతుంటాడు. ఇతనిపై హావాలా కేసులున్నాయి. అయితే గంజాయి వ్యాపారంలో భారీగా లాభాలుంటాయని తెలుసుకున్న వర్గీస్ గత కొంత కాలంగా ఒడిస్సాలో గంజాయి కొని కొచ్చిన్ హార్బర్ కు తరలిస్తున్నాడు. అక్కడ బోట్ల యజమానులకు గంజాయి విక్రయిస్తాడు. అతని స్నేహితుడైన సడకతుల్లా ను ఇందుకు ఉపయోగిస్తుంటాడు.
ఆటో నగర్ వచ్చి పోలీసులకు చిక్కి..
ఈ నెల ఒకటో తేదీన ఆడి కారులో వచ్చిన వర్గీస్ కారులో సమస్య తలెత్తడంతో గుంటూరు ఆటో నగర్ వచ్చాడు. అదేసమయంలో కచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు వర్గీస్ పై దాడి చేసి పట్టుకున్నారు. అంతకముందు సడకతుల్లా స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్నాడు. కారులో గంజాయి ఉందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో వర్గీస్ ను పట్టుకున్నారు. వీరివద్ద నుండి 94 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆడి కారు ఊపయోగిస్తున్నాడని అదే విధంగా గంజాయి కొనడానికి పెట్టుబడి అంతా వర్గీస్సే పెడతాడని పోలీసులు తెలిపాడు. భారీగా లాభాలు వస్తుండటంతో షిప్ ఉన్నా సులభంగా డబ్బు సంపాదించవచ్చని గంజాయివ్యాపారం చేస్తున్నట్లు వర్గీస్ పోలీసులకు తెలిపాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
