AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna River: కృష్ణా నదిపై మరో వంతెన.. రెండు జిల్లాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం

కృష్ణానదిపై(Krishna River) మరో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. కృష్ణా - గుంటూరు జిల్లాలను కలుపుతూ మాదిపాడు-జగ్గయ్యపేట వద్ద రూ.60 కోట్లు తో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు.....

Krishna River: కృష్ణా నదిపై మరో వంతెన.. రెండు జిల్లాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం
Krishna River Bridge
Ganesh Mudavath
|

Updated on: Apr 18, 2022 | 9:24 PM

Share

కృష్ణానదిపై(Krishna River) మరో వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. కృష్ణా – గుంటూరు జిల్లాలను కలుపుతూ మాదిపాడు-జగ్గయ్యపేట వద్ద రూ.60 కోట్లు తో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ఈ వంతెన పూర్తయితే ఎంతో సమయం ఆదా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అవుతుందన్నారు. హైదరాబాద్‌(Hyderabad) నుంచి పెదకూరపాడు, సత్తెనపల్లి ప్రాంత ప్రజలకు ఈ వంతెన నిర్మాణం వల్ల 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే విజయవాడ(Vijayawada) వైపు ట్రాఫిక్‌ కూడా తగ్గుతుంది. పెదకూరపాడు ప్రాంతంలో నాలుగు ఎత్తిపోతల పథకాలు త్వరలో మంజూరు కానున్నాయి. సత్తెమ్మ తల్లి దేవాలయాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగంతో సమావేశమై, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించామని వివరించారు. దేవాలయం వద్ద కనీస సౌకర్యాల కల్పనతో పాటు, గదుల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నామన్నారు.

రాష్ట్రంలో కృష్ణా న‌దిపై మ‌రో భారీ బ్రిడ్జ్ నిర్మించాల‌న్న ప్రతిపాద‌న‌ల‌కు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి రాజధానికి కృష్ణా నదిపై 3.5 కిలోమీటర్ల మేర‌కు ఈ భారీ వంతెన నిర్మాణానికి ఎంపీ కేశినేని నాని ప్రతిపాదనలు పంపారు. దీనికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించార‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ రాజధాని అమరావతిని అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేసేలా చట్టంలో పెట్టారు. కాగా, ఈ వంతెన నిర్మాణానికి అప్పట్లో చంద్రబాబు చర్యలు తీసుకున్నా.. జగన్ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిపేశారని పేర్కొన్నారు.

Also Read

Viral Photo: ఈ ఫోటోలో మొదటిగా కనిపించేదే మీ లవ్ లైఫ్‌.? అదేంటో తెలుసుకోండి!

Viral: ఆ పని చేస్తుండగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు.. టెస్టులు చేసిన డాక్టర్ల ఫ్యూజులు ఔట్!

Kangana Ranaut: మరోసారి సౌత్ హీరోను ఆకాశానికేత్తిసిన కంగనా.. ఏకంగా బిగ్‏బీతోనే పోలుస్తూ..