AP News: టీడీపీ లీడర్స్ చంద్రబాబు, లోకేశ్ పై కేసు.. కల్యాణదుర్గం ఠాణాలో ఫిర్యాదు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై కేసు నమోదైంది. కళ్యాణదుర్గం వైసీపీ మండల కన్వీనర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు....
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై కేసు నమోదైంది. కళ్యాణదుర్గం వైసీపీ మండల కన్వీనర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్యాణదుర్గంలో చిన్నారి మృతి చెందిన ఘటనలో ప్రజలకు ప్రభుత్వంపై ద్వేషభావం కలిగే విధంగా ట్వీట్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు, ప్రజలకు మధ్య విభేదాలు కలిగించే విధంగా టీడీపీ(TDP) నేతలు ప్రవర్తించారని తెలిపారు. ఆ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ట్విట్టర్ లో మంత్రి కె.వి.ఉషా శ్రీ చరణ్ కు వ్యతిరేకంగా ఈ వీడియో పోస్టు చేశారని ఫిర్యాదు దారుడు తెలిపారు. ట్విట్టర్ ద్వారా అసత్య ప్రచారం, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, ప్రజల్లో శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా దుష్ప్రచారం చేసిన కారణంగా ఇరువురిపై కేసు నమోదు చేయాలని కొంగర భాస్కర్ ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో పోస్టు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో చిన్నారి మరణిస్తే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై నమోదైన కేసుపై నమోదు చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. సీఎం జగన్ ఇంత పిరికివాడని తాను అనుకోలేదని, కేసు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. మంత్రి పర్యటన కారణంగా అత్యుత్సాహంతో చిన్నారి ప్రాణాన్ని బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి మరణించడం వెనుక పోలీసుల వైఫల్యం లేదని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని జిల్లా ఎస్పీ ప్రదర్శించారు. ట్రాఫిక్ పేరుతో పోలీసులు ఆపేశారని దుష్ర్పచారం చేయడం సరికాదన్నారు.
Also Read
Online Food Order: జొమాటో కంటే ముందే.. గ్రాసరీ సంస్థ కీలక నిర్ణయం.. 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ
Viral Video: కుక్కుకు దిమ్మతిరిగే షాకిచ్చిన చేప.. ఈల్ ఫిష్ పట్టుకోవడంతో..