Andhra News: ఏపీ పట్టణ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.10,320 కోట్ల పనులకు సర్కారు ఆమోదం
రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. ఈ మేరకు AMRUT 2.0 పథకం కింద రూ.10,319.93 కోట్ల విలువైన 281 పనులు చేసేందుకు ఆమోదం తెలుపుతూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. అమృత్ (AMRUT) 2.0 పథకం కింద రూ.10,319. 93 కోట్ల విలువైన 281 పనులకు చేసేందుకు నిధులు కేటాయిస్తూ మున్సిపల్ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ కూడా చేసింది. అలాగే ఈ పనుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతను APUFIDC, పబ్లిక్ హెల్త్, గ్రీన్ బిల్డింగ్స్ కార్పొరేషన్‌లకు అప్పగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది.
అయితే ఈ మొత్తం ప్రాజెక్టు ఖర్చులో కేంద్రం రూ. 2,470 కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,490 కోట్లు విడుదల చేయనున్నాయి. ఇక ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ. 925 కోట్లు, పట్టణాల వాటా రూ. 590 కోట్లు విడుదల చేయనున్నాయి. అంతా కలిపి ప్రాజెక్టు క్యాపెక్స్ రూ.6,477 కోట్లుగా.. దీనికి 10 ఏళ్ల నిర్వహణ ఖర్చు రూ.1, 499 కోట్లుగా, వడ్డీ ఖర్చు కింద రూ.2, 344 కోట్లుగా నిర్ధారించింది.
అయితే ఈ పనులు తీసుకునే సంస్థలకు ప్రభుత్వం ఒక నిబంధనను పెట్టింది. ఒప్పందం సమయంలో ఆయా సంస్థలు కొంత మొత్తాన్ని సెక్యూరిటీగా చెల్లించాలని పేర్కొంది. ఈ పనులు సాగుతున్న సమయంలో ఈ నిధులు కట్ చేయకుండా మాఫీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పనుల వాటా కోసం అవసరమైన నిధులను సేకరించేందుకు APUFIDCకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ తాజాగా నిర్ణయంతో ఇది రాష్ట్ర పట్టణాభివృద్ధి చరిత్రలో అతి పెద్ద పెట్టుబడి ప్రాజెక్ట్‌గా రికార్డుల్లో నమోదు కానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




