AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golden Kachidi Fish: ఆ చేప బంగారం.. ధరెంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

అనకాపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు బయలుదేరారు.. ఒక్కొక్కరికి ఒక్కో రకం చేపలు పడ్డాయి.. కొందరికి వంజరాలు.. మరికొందరికి రాయి చేపలు.. కానీ ఓ మత్స్యకారుడికి మాత్రం పంటపండింది.. ఏకంగా కచిడి చేప గేలానికి చిక్కడంతో ఇక ఎగిరి గంతేశాడు.. చివరకు ఈ చేపను ఒడ్డుకు తెచ్చి వేలం వేయగా.. దానిని దక్కించుకునేందుకు చాలామంది పోటీపడ్డారు.

Golden Kachidi Fish: ఆ చేప బంగారం.. ధరెంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
Golden Kachidi Fish
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 04, 2025 | 7:04 PM

Share

అనకాపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు బయలుదేరారు.. ఒక్కొక్కరికి ఒక్కో రకం చేపలు పడ్డాయి.. కొందరికి వంజరాలు.. మరికొందరికి రాయి చేపలు.. కానీ ఓ మత్స్యకారుడికి మాత్రం పంటపండింది.. ఏకంగా కచిడి చేప గేలానికి చిక్కడంతో ఇక ఎగిరి గంతేశాడు.. అనకాపల్లి జిల్లా పూడిమడకలో వేటకు వెళ్లారు మత్స్యకారులు.. అచ్యుతాపురం మండలం సముద్రంలో వేట చేస్తూ ఉన్నారు. పూడిమడక మత్స్యకారులకు వంజరం, రాయి చేపలు పడ్డాయి.. కానీ జాలారిపాలేనికి చెందిన మత్స్యకారునికి మాత్రం కచిడి చేప చిక్కింది.

14 కిలోల బరువు ఉన్న ఈ చేపను వాటిని చూడగానే మత్స్యకారూలు ఎగిరి గంతేశారు. ఒడ్డుకు ఆ చేపను తీసుకొచ్చారు. అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న కొంతమంది వ్యాపారులు ఆ చేపలను కొనేందుకు పోటీపడ్డారు. చివరకు ఈ చేపను ఒకరు 28వేలకు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు మత్స్యకారులు.. దీని కోసం చాలా మంది పోటీ పడ్డారని తెలిపారు.

రుచి.. ఔషధ గుణాలు..

కచిడి చేపలు బంగారు వర్ణంలో ఉంటాయి. చూసేందుకు ఆకట్టుకుంటాయి. అందుకే వీటిని గోల్డెన్ ఫిష్ అని కూడా అంటారు. మగ చేపలు అయితే నిగనిగా లాడుతూ కనిపిస్తాయి. రుచి మామూలుగా ఉండదు మరి.. ఔషధ గుణాలు కూడా ఎక్కువే అంటున్నారు మత్స్యకారులు. కొన్ని రకాల మందుల్లో కూడా వీటి అవశేషాలు వాడతారని చెబుతున్నారు. అంతేకాదు సర్జరీ చేసిన తర్వాత వేసే కుట్ల కోసం ఈ చేప నుంచి వచ్చే పదార్థంతో తయారు చేస్తారట. ఈ చేప రెక్కలను మరికొన్ని పదార్థాలు ప్రాసెసింగ్ చేసేందుకు వినియోగిస్తారని కూడా మరి కొంతమంది చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే