AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. బుడి బుడి అడుగులతో స్కూలుకు బయలుదేరింది.. ఇంతలోనే ఊహించని ప్రమాదం..

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులు ప్రయాణించే బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా పలువురు విద్యార్థినిలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

అయ్యో దేవుడా.. బుడి బుడి అడుగులతో స్కూలుకు బయలుదేరింది.. ఇంతలోనే ఊహించని ప్రమాదం..
School Bus Accident
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Aug 12, 2024 | 1:54 PM

Share

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులు ప్రయాణించే బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా పలువురు విద్యార్థినిలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బస్సుకున్న స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు పాఠశాల యాజమాన్యం చెబుతుండగా.. పాఠశాల బస్సుల ఫిట్నెస్ విషయంలో సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందువల్లె ప్రమాదాలు సంభవిస్తున్నాయని విద్యార్థి సంఘాల ఆరోపిస్తున్నాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం అయ్యలరాజు పల్లి వద్ద ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో రెడ్డి వీరం భవిష్య అనే రెండవ తరగతి చదివే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బస్సులో ఉన్న సుమారు 15మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సోమవారం ఉదయం పాఠశాలకు బయలుదేరిన విద్యార్థులతో స్కూల్ బస్సు అయ్యల రాజు పల్లి సమీపంలో చేరింది. అప్పటికే 15 మంది పైగా విద్యార్థినిలు స్కూల్ బస్సులో ఉన్నారు. అయ్యల రాజు గారి పల్లి సమీపంలోకి బస్సు వస్తుండగా స్కూల్ బస్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో రెండవ తరగతి చదువుతున్న భవిష్య అనే బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.. చిన్నారి విలవిలలాడుతూ అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన బాలిక వీరంరెడ్డి మధుసూదన్, అరుణల పెద్ద కుమార్తె.. భవిష్య తలకు తీవ్రంగా గాయాలు కావడంతో మృతి చెందింది. పలువురు విద్యార్థులకు గాయాలు కాగా వివిధ ప్రైవేట్ ఆస్పత్రి లకు తరలించి వారికి చికిత్స చేయించారు. మృతి చెందిన చిన్నారిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్టీరింగ్ రాడ్ కట్ అవడంతో ప్రమాదం జరిగినట్లుగా కొందరు చెబుతున్నారు.. అయితే.. గత కొద్దిరోజుల క్రితం ఇదే స్కూల్ వ్యాను రెండు బైక్ లను కూడా ఢీ కొన్నట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

కండిషన్ లేని బస్సులు నడుపుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లి మండలం, చిన్న వారం పాడు వద్ద, ప్రైవేట్ పాఠశాల, వ్యాను బోల్తా పడి, ఒక విద్యార్థి మృతి చెందడం, అనేక మంది విద్యార్థులకు గాయాలు అవడం బాధాకరమని, తక్షణం ఆ పాఠశాల యాజమాన్యంపై, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యా ఉన్నతాధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేత తుమ్మల లవకుమార్ డిమాండ్ చేశారు.

School Bus Accident

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం అయ్యలరాజు పల్లి వద్ద ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వాహనాలు కండిషన్ లో లేకపోవడం, బ్రేక్ ఇన్స్పెక్టర్, ప్రైవేటు విద్యాసంస్థల వద్ద మామూలు తీసుకొని, ఎఫ్సీలు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు . ఆ విద్యాసంస్థ యాజమాన్యంపై వెంటనే చర్య తీసుకోవాలని కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..