Tirumala: ఆ టైం దాటితే తిరుమల ఘాట్ రోడ్‌లో బైక్స్‌కు నో ఎంట్రీ.. రీజన్ ఇదే

గత ఏడాది జూలై నుంచి అలిపిరి నడక మార్గంలో, తిరుమల ఘాట్ రోడ్లలో సంచరిస్తూ కలకలం రేపిన చిరుతలు ఇప్పుడు మళ్ళీ భక్తుల కంట పడుతున్నాయి. యానిమల్స్ బ్రీడింగ్ సమయం కావడంతో తరచూ నడక మార్గాన్ని, మొదటి ఘాట్ రోడ్డును దాటుతూ భక్తుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి.

Tirumala: ఆ టైం దాటితే తిరుమల ఘాట్ రోడ్‌లో బైక్స్‌కు నో ఎంట్రీ.. రీజన్ ఇదే
Tirumala Ghat Road
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 12, 2024 | 1:17 PM

తిరుమల ఘాట్ రోడ్‌లో మళ్ళీ ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి సమయాల్లో టూ వీలర్స్ రాకపోకలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇందుకు కారణం మళ్లీ చిరుత కనిపించడమే. గత ఏడాది జూలై నుంచి అలిపిరి నడక మార్గంలో, తిరుమల ఘాట్ రోడ్లలో సంచరిస్తూ కలకలం రేపిన చిరుతలు ఇప్పుడు మళ్ళీ భక్తుల కంట పడుతున్నాయి. యానిమల్స్ బ్రీడింగ్ సమయం కావడంతో తరచూ నడక మార్గాన్ని, మొదటి ఘాట్ రోడ్డును దాటుతూ భక్తుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. ఇందులో భాగంగానే హ్యూమన్, యానిమల్ కాన్‌ప్లిక్ట్‌కు ఛాన్స్ ఇవ్వకుండా టీటీడీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తోంది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకే రెండు ఘాట్ రోడ్డులలో బైక్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆగస్టు12, సోమవారం నుంచే అమలు చేస్తోంది. సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇప్పటిదాకా తెల్లవారు జామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు బైక్స్ రాకపోకలకు అనుమతి ఉండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని టీటీడీ మరింత కుదించింది.

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్డులోని ఎన్ ఎస్ టెంపుల్ వద్ద 54 వ క్రాస్‌లో చిరుత కనిపించడంతోనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఘాట్ రోడ్డును క్రాస్ చేస్తున్న చిరుతను గుర్తించిన భక్తులు.. టిటిడి సెక్యూరిటీ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వైల్డ్ యానిమల్స్ బ్రీడింగ్ సమయం కాబట్టి ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలన్న ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న టిటిడి ఈ మేరకు ఘాట్ రోడ్డులో బైక్స్ రాకపోకలపై ఆంక్షలు విధించింది. అలిపిరిలోని సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం, తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్ద ఘాట్ రోడ్డ లో బైక్స్ అనుమతించే టైమింగ్స్ భక్తులకు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..