Gannavaram Tension: ‘ఉప్పూ కారం మేమూ తింటున్నాం.. దమ్ముంటే గన్నవరం రా’.. బుద్దా సవాల్‌కు వంశీ రియాక్షన్..
గన్నవరం గల్లీల్లో సస్పెన్స్ వీడింది. బుద్దా వెంకన్న సవాల్‌కు స్పందించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. పొరుగు ఊరికెళ్లి ఎందుకు గొడవ పడతా.. ఏదైనా ఉంటే మీరే మా ఊరికి రండి అంటూ ప్రతిసవాల్ చేశారాయన.
గన్నవరం గల్లీల్లో సస్పెన్స్ వీడింది. బుద్దా వెంకన్న సవాల్‌కు స్పందించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. పొరుగు ఊరికెళ్లి ఎందుకు గొడవ పడతా.. ఏదైనా ఉంటే మీరే మా ఊరికి రండి అంటూ ప్రతిసవాల్ చేశారాయన. ఇదే అంశంపై టీవీ9తో మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. బుద్దా వెంకన్నకు ప్రతి సవాల్ విసిరారు. ఎక్కడో విజయవాడలో కాదు.. దమ్ముంటే గన్నవరం రావాలంటూ సవాల్ విసిరారు. సోమవారం జరిగిన ఘటన సమయంలో తాను అక్కడ లేనని, ఉంటే అక్కడితో ఆగేది కాదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. నోటికొచ్చినట్లు సిటీలో మాట్లాడితే ఊరుకుంటారేమో గానీ గ్రామాల్లో ఊరుకోరని అన్నారు.
‘ఉప్పు కారం మేము తింటున్నాం ఏదన్నా అంటే మేం ఊరుకోము. నా కార్ డోర్ పట్టుకుని తిరిగినవాళ్లు నాకే సవాల్ విసురుతున్నారు. కొడాలి నాని, నేను ఎవ్వరిని ఏమీ అనము. ఎవరైనా మమ్మల్ని అంటే ఊరుకోము. వేరే నియోజక వర్గాల నుండి ఇంపోర్టెడ్ లీడర్స్ ను ఇక్కడకు తీసుకొని వచ్చారు.’ అని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వంశీ.
ఎన్టీఆర్ సర్కిల్‌కు వెళ్తానంటున్న బుద్దా..
మరోవైపు తాను సవాల్ చేసిన విధంగా ఎన్టీఆర్ సర్కిల్‌కు వెళ్తానని పునరుద్ఘాటించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. కాసేపట్లోనే ఆయన ఎన్టీఆర్ సర్కిల్‌కు బయలుదేరనున్నారు. కాగా, ఈ టెన్షన్ నేపథ్యంలో బుద్దా వెంకన్న నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు, బుద్దా నివాసానికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. అటు నేతల సవాళ్లు, ఇటు పార్టీ శ్రేణుల అలజడి.. వెరసి గన్నవరాన్ని మరింత గరంగరంగా మార్చేశాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..