Yanam: తెలుగు అబ్బాయి, ఫ్రాన్స్ అమ్మాయి ఒక్కటైన వేళ.. నవ దంపతులను ఆశీర్వదించిన సుమ-రాజీవ్
తెలుగు అబ్బాయి, ఫ్రాన్స్ అమ్మాయిల వివాహ వేడుకకు కేంద్ర పాలిత ప్రాంతం యానాం వేదికైంది. ఆ వివరాలు మీ కోొసం...
కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో… యానాం అబ్బాయికి.. ఫ్రెంచ్ అమ్మాయితో తెలుగు సంప్రదాయ రీతిలో అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఖండాలు దాటినప్పటికీ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను మరువలేదు ఆ కుటుంబం. కేంద్రపాలిత ప్రాంతం యానాం పట్టణానికి చెందిన చింతా వెంకట్ కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం ఫ్రాన్స్ దేశంలో స్థిరపడ్డారు. ఫ్రెంచ్ పౌరసత్వం ఉన్నప్పటికి ఫ్రాన్స్‌లో కొన్ని రోజులు, ఇండియాలో కొన్ని రోజులు ఉంటారు వీళ్లు. చింతా వెంకట్, వేద దంపతుల కుమారుడు సుమంత్ మాత్రం ఫ్రాన్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే దేశానికి చెందిన యువతి క్లైమెన్ టన్ తో అతడికి వివాహం కుదిరింది. ఈ వివాహాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో స్వస్థలం యానాంలో చేయాలని నిర్ణయించారు. దీంతో హిందూ సంప్రదాయ రీతిలో స్థానిక గాజుల గార్డెన్స్ కల్యాణ మండపంలో సుమంత్, క్లైమెన్ టన్ వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.
వధూవరులను సుమంత్ బంధువులైన నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు, ఇతర బంధుమిత్రులు ఆశీర్వదించారు. పెళ్లికి ఫ్రాన్స్‌కు చెందిన 30 మంది సుమంత్, క్లమెన్‌టైన్ కజిన్స్, ఫ్రెండ్స్ హాజరయ్యారు. వారం రోజులు క్రితమే వీరంతా యానాం చేరకుని.. ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ సందడి చేశారు. విదేశాల్లో స్థిరపడినా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చినా వెంకట్ కుటుంబాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.