Andhra Pradesh: ఆ మొక్కను చూసి పరుగులు తీసిన సచివాలయం సిబ్బంది.. అంతలోనే నిజం తెలిసి..
Eluru, October 03: అదో సచివాలయం.. సమయం అవగానే అధికారులు, గ్రామ పెద్దలు అందరూ అక్కడ ఉంటారు. ప్రభుత్వ పరమైన అధికారిక కార్యక్రమాలన్నింటినీ ఆ కార్యాలయం వేదికగానే నిర్వహిస్తారు. ఆ కార్యాలయంలో పచ్చదనం కోసం చుట్టూ చెట్లను సైతం నాటారు. ఎటు చూసినా పచ్చని చెట్లతో ఆ కార్యలయంలో ఎంతో ఆహ్లాదకరమైన పరిస్థితి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడే అసలు సమస్య వచ్చింది.

Eluru, October 03: అదో సచివాలయం.. సమయం అవగానే అధికారులు, గ్రామ పెద్దలు అందరూ అక్కడ ఉంటారు. ప్రభుత్వ పరమైన అధికారిక కార్యక్రమాలన్నింటినీ ఆ కార్యాలయం వేదికగానే నిర్వహిస్తారు. ఆ కార్యాలయంలో పచ్చదనం కోసం చుట్టూ చెట్లను సైతం నాటారు. ఎటు చూసినా పచ్చని చెట్లతో ఆ కార్యలయంలో ఎంతో ఆహ్లాదకరమైన పరిస్థితి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఈ సమస్యకు కారణం ఓ చెట్టు. వాస్తవానికి చెట్టు కారణంగా రోజూ ఎంతోమంది జైలుపాలవుతున్నారు. ఇలాంటి చెట్టు ఇప్పుడు ఏకంగా సచివాలయంలోనే ఉందంటూ పెద్ద ప్రచారం జరిగింది. ఆ ప్రచారం దెబ్బకు అందరూ ఉరుకులు పరుగులు తీయాల్సి వచ్చింది. ఇంతకీ అక్కడ ఉన్న చెట్టు ఏంటి? అసలేం జరిగిందో ఓసారి చూద్దాం..
గ్రామ సచివాలయంలో గంజాయి మొక్క పెంపకం కలకలం రేపింది. దీంతో అధికారులు గందరగళానికి గురై పరుగులు తీశారు. ఏం జరిగిందో అంతా తెలుసుకునే లోపు వీడియోలు వైరల్‌గా మారాయి. ఓ వైపు గ్రామ సచివాలయం అంటున్నారు.. మరోవైపు గంజాయి మొక్క అంటున్నారు.. అసలేం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారా. నిజం గడప దాటేలోపు అబద్ధం లోకాన్ని చుట్టి వస్తుందనే నానుడి నిజం చేసింది ఈ సంఘటన. సోషల్ మీడియా పుణ్యమా అని ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి ప్రస్తుత జీవన విధానంలో ఏర్పడింది. సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకన్నా ఎక్కువ నష్టం కూడా ఉంది.. తెలిసి కొందరు, తెలియక కొందరు, తెలిసి తెలియక మరికొందరు ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు పెడుతున్న పోస్టులు కొన్ని సార్లు గందరగోళానికి గురిచేస్తున్నాయి.
నిజమో, అబద్దమో తెలుసుకోకుండానే తమ సన్నిహితులకు ఫార్వార్డులు చేస్తూ అబద్దాన్ని సైతం నిజం అనే ప్రచారం చేసే విధంగా వారికి సహకరిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కొందరు ఆకతాయిలు చేసిన పనికి అక్కడ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న యావత్ అధికారులు పరుగులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగుడెం సచివాలయం-2 ప్రాంగణంలో కొన్ని మొక్కలు పెరుగుతున్నాయి. అయితే పచ్చదనం కోసమని సిబ్బంది వాటిని సంరక్షిస్తూ ఉన్నారు. అందులో పూల మొక్కలైన బంతితోపాటు వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. వాటిలో బంతి మొక్కను పోలివున్న ఓ మొక్కని కొందరు ఆకతాయిలు వీడియో తీసి యార్నగుడెం సచివాలయం-2 లో గంజాయి మొక్కని పెంచుతున్నారంటూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తూ తీవ్ర కలకలం రేపారు. అది నిజమా.. అబద్దమా.. అని సంబంధిత అధికారుల వద్ద నుండి వివరణ తీసుకోకుండానే ఒక గ్రూపు నుంచి మరొక గ్రూపు క్షణాల్లో ఆ వార్త దావానంలో వ్యాపించింది. ఇంకేముంది విషయం అధికారులకు చేరింది. వెంటనే స్పందించిన అధికారులు అది గంజాయి మొక్క కాదని అది ఓ గడ్డి మొక్కని స్పష్టం చేశారు. అలాగే వివాదానికి కారణమైన ఆ మొక్కను సైతం తొలగించి పక్కన పడేశారు. దాంతో కొంతసేపు ఆకతాయిలు పెట్టిన పోస్టుల కారణంగా అధికారులలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దేవరపల్లి ఎస్సై కర్రి శ్రీహరి రావు సైతం గంజాయి మొక్క కలకలంపై స్పందించారు. యార్నగుడెం సచివాలయం-2లో పెరిగిన మొక్కని గంజాయి మొక్కగా ఎవరు నిర్ధారించలేదని, అదంతా ఆకతాయిల పనని, ఎవరైనా సరే నిజ నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




