AP Weather: బాబోయ్.. మళ్లీ అల్పపీడనం ముప్పు.. ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు

ఇప్ప‌టికే ఏపీలో భారీ వర్షపాతం నమోదయ్యింది. భూగర్భ జలాలు పెరిగాయి. తాజాగా రాష్ట్రానికి మరో అల్పపీడన ముప్పు ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

AP Weather: బాబోయ్.. మళ్లీ అల్పపీడనం ముప్పు.. ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు
Andhra Pradesh Weather Report
Follow us

|

Updated on: Nov 18, 2022 | 3:36 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం & పొరుగున ఉన్న ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఇది వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి క్రమంగా దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో ఈశాన్య గాలులు వీస్తాయి. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కరిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.  నవంబర్ 19 నుండి 21వ తేదీ వరకు మత్స్యకారులు దక్షిణ ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :– 

ఈ రోజు, రేపు :- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది.

ఎల్లుండి ;- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- 

ఈ రోజు :- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

రేపు :- తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :- 

ఈ రోజు, రేపు:- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది

చెన్నైను వీడని వానలు

తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాశి పురం, సేలం, ఈరోడ్ జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. కావేరి నదికి ఎగువ నుంచి అంతకంతకు వరద పెరుగుతోంది. మరో వైపు రేపటి నుంచి రాష్ట్రానికి మరోసారి భారీ వర్షసూచన ఉందంటోంది వాతావరణ శాఖ. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్సుంది. ఎటు చూసిన వరద నీరే కనిపిస్తోంది. ఇల్లు సైతం నీట మునిగాయి. నీరు తప్ప నేల కనిపించడం లేదు. దీంతో నిత్యావసరాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..