AP Rains: ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. భయపెడుతోన్న అల్పపీడనం! ఆ జిల్లాలకు..

ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల 20వ తేదీకి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఒకవేళ తీవ్ర అల్పపీడనం..

AP Rains: ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. భయపెడుతోన్న అల్పపీడనం! ఆ జిల్లాలకు..
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 18, 2022 | 12:57 PM

బుధవారం అండమాన్‌కు ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడింది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే మూడు రోజుల్లో తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల 20వ తేదీకి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఒకవేళ తీవ్ర అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారితే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం ఇవాళ అనగా 18, 19, 20 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ నెల 21వ తేదీన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప, ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు. కాగా, ఏపీలో చలి విజృంభిస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది రాబోయే నాలుగు రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉంటాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.