AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆ రాగి పాత్ర రూ. 25 లక్షలే.. లచ్చలు.. లచ్చలు తెచ్చిపెడుతుందన్నారు.. సీన్ కట్ చేస్తే

మోసపోయేవాడు ఉన్నంతవరకు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. రైస్ పుల్లింగ్ మోసాల విషయంలో ఇది అక్షరాలా నిజమనే చెప్పాలి. పోలిసులు ఎంతగా చెబుతున్న, ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నా రైస్ పుల్లింగ్ పేరిట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఈ మోసం వెలుగు చూసింది.

Andhra: ఆ రాగి పాత్ర రూ. 25 లక్షలే.. లచ్చలు.. లచ్చలు తెచ్చిపెడుతుందన్నారు.. సీన్ కట్ చేస్తే
Ragi Patra
S Srinivasa Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 02, 2025 | 8:09 AM

Share

అక్షయ పాత్ర, రైస్ పుల్లింగ్ పేరిట మాసాలకు పాల్పడుతున్న ముఠాని శ్రీకాకుళం జిల్లా పోలిసులు అరెస్టు చేసారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మే 29న 10 మంది వ్యక్తులు సరుబుజ్జిలి మండలం, వెన్నెలవలస గ్రామం నుంచి రిజర్వాయర్‌కి వెళ్లేదారిలో పాడుపడిన బంగ్లా వద్ద పురాతన రైస్ పుల్లింగ్, అక్షయ పాత్ర అమ్ముట, కొనుట చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పది మందిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నంకు చెందిన రవి శంకర్, అతని స్నేహితులైన రుద్రరాజు వెంకటారంగరాజు, కనకరాజు, రఘునాధరావు,మురళీకృష్ణ, గరిక శ్రీను, కొండ వెంకట నాగ సత్యన్నారాయణ.. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవారు.

కరోనా కారణంగా వ్యాపారంలో ఆర్ధికంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గతంలో అనుభవం ఉన్న రవి శంకర్ మధ్యవర్తిత్వం ద్వారా పూని భద్రయ్య వద్ద, పురాతన వస్తువు అయిన రైస్ పుల్లింగ్ అక్షయ పాత్ర ను 25 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కిందటి నెల 29వ తేదీన 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తుండగా సరుబుజ్జిలి పోలీసు స్టేషన్ SI, అతని సిబ్బంది పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశారు. భద్రయ్యపై 2016లో కొత్తూరులో ఇలాంటి రైస్ పుల్లింగ్ చీటింగ్‌లో కొత్తూరు పోలీసులు భద్రయ్యను గతంలోనూ అరెస్ట్ చేసారు. భద్రయ్య, పూని రాజులది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామం. అక్షయపాత్ర, రైస్ పుల్లింగ్ లాంటివి ఎవరు నమ్మి మోసపోవద్దని పోలిసులు చెబుతున్నారు. వాటికి ఎటువంటి శాస్త్రీయత లేదని పోలీసులు అంటూరున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..