AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టిన కూటమి.. ఏపీ కేబినెట్ రేసులో ఆ నలుగురు..

ఎన్నికల వేడి తగ్గినా ఫలితాల తరువాత కూటమి అభ్యర్దులలో మరో వేడి మొదలైంది. కొత్తగా గెలిచిన అభ్యర్దులు సంబరాలు చేసుకుంటుంటే సీనియర్ నేతలు వారి అధినేతల వద్ద మంత్రి పదవులకోసం మంతనాలు మొదలు పెట్టేసారు. ముఖ్యంగా రాయలసీమ నేతలు ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ అధినేత సన్నిహిత వర్గాల దగ్గర వారి మనసులోని మాటలను బయటపెట్టేశారంట. ముఖ్యంగా కడప నేతలు ఈవరుసలో ముందున్నారు. ఎన్నడూ లేని విధంగా కడపలో వైసిపి కోటను కూటమి బద్దలు కొట్టడంతో ఈజిల్లా నేతలు తమదైన శైలిలో మంతనాలు మొదలుపెట్టేశారని టాక్ వినిపిస్తోంది.

వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టిన కూటమి.. ఏపీ కేబినెట్ రేసులో ఆ నలుగురు..
Kadapa Tdp, Bjp
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jun 09, 2024 | 12:27 PM

Share

ఎన్నికల వేడి తగ్గినా ఫలితాల తరువాత కూటమి అభ్యర్దులలో మరో వేడి మొదలైంది. కొత్తగా గెలిచిన అభ్యర్దులు సంబరాలు చేసుకుంటుంటే సీనియర్ నేతలు వారి అధినేతల వద్ద మంత్రి పదవులకోసం మంతనాలు మొదలు పెట్టేసారు. ముఖ్యంగా రాయలసీమ నేతలు ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ అధినేత సన్నిహిత వర్గాల దగ్గర వారి మనసులోని మాటలను బయటపెట్టేశారంట. ముఖ్యంగా కడప నేతలు ఈవరుసలో ముందున్నారు. ఎన్నడూ లేని విధంగా కడపలో వైసిపి కోటను కూటమి బద్దలు కొట్టడంతో ఈజిల్లా నేతలు తమదైన శైలిలో మంతనాలు మొదలుపెట్టేశారని టాక్ వినిపిస్తోంది.

కడప జిల్లా కూటమినేతలలో మంత్రి ఎవరు అనేదానిపై ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‎గా మారింది. కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు నియోజకవర్గాలలో రెండు వైసిపి గెలవగా 5 కూటమి సభ్యులు గెలుపొందారు. అందులో ఒక బీజేపీ నేత ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఐదుగురిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉన్న ఐదుగురిలో కడప అసెంబ్లీకి సంబంధించి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమె భర్త శ్రీనివాసరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్నారు. ఈయనకు, చంద్రబాబుతో అత్యంత దగ్గరి సన్నిహిత్యం ఉంది. ఇక జమ్మలమడుగు నుంచి బిజెపి అభ్యర్థిగా గెలిచిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా మంత్రి రేసులో ఉన్నారు. ఈయనకు కూడా చంద్రబాబు దగ్గర అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఒకవేళ బిజెపికి మంత్రి పదవులు ఇచ్చే క్రమంలో ఆదినారాయణ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంటుంది. ఇలా కడప నుంచి మంత్రి పదవి వరించే నేతల జాబితాలో సీనియర్ నేతగా పేరుపొందిన పెద్దాయన వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు. వైయస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండి రాజకీయ జీవితంతో ఆయనకు సమకాలీకుడిగా పేరుంది. ఈయనకు మంత్రిపదవిని ఇస్తే కడపలో మరింత టీడీపీ క్యాడర్ ను పుంజుకునేలా చేస్తారన్న ఆలోచన కూడా వినిపిస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే జిల్లాలో బలమైన నేత, పోలిట్ బ్యూరో సభ్యునిగా ఉంటూ పార్టీ కేడర్ ను బలోపేతం చేసిన శ్రీనివాసులు రెడ్డి సతీమణి రెడ్డెప్పగారి మధవికి మంత్రివర్గంలో చోటు దక్కేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. కడప నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్న వైసీపీని కాదని ఇక్కడ ప్రజలు టిడిపిని గెలిపించడంతో మాధవి రెడ్డికి మంత్రి పదవి ఖాయంగా శ్రీనివాసరెడ్డి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అలాగే మహిళా నేత కావడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దాదాపు ఈమెకు అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు కొందరు నేతలు. ఆ విధంగా పావులు కూడా కదుపుతున్నట్లు సమాచారం. ఇక మరో నేత పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని మొదటిసారి ఒక బీసీ యాదవ సామాజిక వర్గం నేతను గెలిపించారు అక్కడి ప్రజలు. గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన సుధాకర్ యాదవ్ ఈసారి గట్టిగా నిలబడి గెలిచి చూపించారు. అంతేకాకుండా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన యనమల రామకృష్ణకు స్వయానా వియ్యంకుడు కావడంతో ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి దక్కించుకుంటారన్న ఆశలో ఆయనకు దగ్గరగా ఉన్న శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ నలుగురు నేతలు మంత్రు పదవుల కోసం ఆశావాహులుగా ఉన్నారు. వారిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..