AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో ఆవిర్భవించిన “లిబరేషన్ కాంగ్రెస్” పార్టీ.. 15 అంశాలతో మ్యానిఫెస్టో విడుదల..

ఎన్నికల వేళ ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. అధిక జన మహా సంకల్ప సభ సాక్షిగా పార్టీ పేరును ప్రకటించారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఇప్పటికే మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ (ఎన్) పార్టీని స్థాపించి ముందుక సాగుతున్నారు. ఈ తరుణంలో మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి కొత్త పార్టీ స్థాపించి.. గత కొంత కాలంగా ప్రజల్లో మమేకం అవుతున్నారు.

AP News: ఏపీలో ఆవిర్భవించిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ.. 15 అంశాలతో మ్యానిఫెస్టో విడుదల..
Former Ias Officer
Srikar T
|

Updated on: Feb 15, 2024 | 8:00 AM

Share

ఎన్నికల వేళ ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. అధిక జన మహా సంకల్ప సభ సాక్షిగా పార్టీ పేరును ప్రకటించారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఇప్పటికే మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ (ఎన్) పార్టీని స్థాపించి ముందుక సాగుతున్నారు. ఈ తరుణంలో మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి కొత్త పార్టీ స్థాపించి.. గత కొంత కాలంగా ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఫిబ్రవరి 14న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణం నుంచి 15 అంశాలతో మ్యానిఫెస్టో విడుదల చేశారు. దీనికంటే ముందు “లిబరేషన్ కాంగ్రేస్” అంటూ తన పార్టీ పేరును ప్రకటించారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఈ సభలో మాట్లాడుతూ ముందుగా తనకు జన్మనిచ్చిన్న తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఆ తరువాత ఐక్యత విజయపదం పాదయాత్రలో సహకరించిన ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. దృఢమైన సంకల్పంతో పాదయాత్ర ప్రారంభించాను, అన్నింటినీ తట్టుకొని పాదయాత్ర పూర్తి స్థాయిలో విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు.

అధిక జనులకు పేదరికం నుంచి విముక్తి కల్గించాలనే ధ్యేయంతో చేసిన పాదయాత్ర ఇది.. ఎవరి మెప్పుకోసమో, లబ్దికోసమో దీనిని చేపట్టలేదన్నారు. బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం తాను ఈ పాదయాత్ర చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ సభ్యసమాజం సిగ్గుపడే పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయ వ్యవస్థకు నూతన వరవడిని తీసుకువచ్చి రాజనీతిజ్ఞుడిగా రాజకీయాలను సూపథంలో కి తీసుకువస్తానని మాట ఇచ్చారు. భూమి, సంపద లేకుండా అధిక జనులు ఉండటం గమనార్హం అని తెలిపారు. వైసీపీ, టీడీపీ ఇతర పార్టీలు పాలన సాగించినప్పటికీ అధిక జనులు మాత్రం ఎప్పుడు పేదలుగానే మిగిలిపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదల కోసం సంపద సృష్టిస్తాను అని అంటున్నారు. గతం టీడీపీ పాలనలో కూడా పేదల భూములు లాక్కోలేదా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సెక్యులరిజం అనేది ఉందా..? అని నిలదీశారు. మైనారిటీలకు, బడుగులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛా, సమానత్వం, సౌబ్రాతృత్వంతో పాలన సాగించడానికి ఒక వేదిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. విద్యా, వైద్యం, మౌలిక వసతులు.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి ఏరులై పారుతుందన్నారు. ,దానికి బానిసలుగా మారిన కొందరి జీవితాలు నిర్వీర్యమై పోతున్నాయన్నయని తెలిపారు. మహిళలు,పురుషులకు ఎలాంటి ఉపాధి లేక చిన్నాభిన్నమైపోతున్నారని చెప్పారు. రైతులు, కౌలు రైతులకు కన్నీళ్ళు తప్ప మిగిలేది ఏమీలేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోవడంతో పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఘటనలు ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..