Chandrababu: ఎన్నికల నేపథ్యంలో జోరు పెంచిన బాబు.. పార్టీ నేతలకు కీలక సూచనలు..

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. సమయం లేదు మిత్రమా విజయమే లక్ష్యంగా దుసుకెళ్లాలని నేతలను ఆదేశిస్తున్నారు. టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికతో పాటు సొంత పార్టీలోని అసంతృప్త నేతలను పిలిచి చర్చిస్తున్నారు. ఏపీలో జనసేన పోటీ చేసే స్థానాలను మినహాయించి టిడిపి పోటీ చేసే స్థానాలపై ఫోకస్ పెట్టారు టిడిపి అధినేత చంద్రబాబు.

Chandrababu: ఎన్నికల నేపథ్యంలో జోరు పెంచిన బాబు.. పార్టీ నేతలకు కీలక సూచనలు..
Chandrababu Naidu
Follow us
Srikar T

|

Updated on: Feb 15, 2024 | 7:15 AM

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. సమయం లేదు మిత్రమా విజయమే లక్ష్యంగా దుసుకెళ్లాలని నేతలను ఆదేశిస్తున్నారు. టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికతో పాటు సొంత పార్టీలోని అసంతృప్త నేతలను పిలిచి చర్చిస్తున్నారు. ఏపీలో జనసేన పోటీ చేసే స్థానాలను మినహాయించి టిడిపి పోటీ చేసే స్థానాలపై ఫోకస్ పెట్టారు టిడిపి అధినేత చంద్రబాబు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి ఎన్నికల ప్రచారంలోకి దుసుకెళ్తోంది. చంద్రబాబు సైతం ఇదే దిశగా అడుగులు వేస్తున్నారు. వరుసగా టీడీపీ ముఖ్య నేతలు, సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ తరపున నియోజకవర్గంలో టికెట్లను ఆశిస్తున్న వారిని, ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను పిలిచి బుజ్జగిస్తున్నారు.

టికెట్ల కోసం పోటీ ఏర్పడ్డ ఆళ్లగడ్డ ఒంగోలు, సత్తెనపల్లి, కొవ్వూరుతో పాటు మరికొన్ని స్థానాలకు సంబంధించి అసంతృప్తిగా ఉన్న నేతలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు బాబు. ఇక మరోవైపు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చే నేతల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్థసారథి పాటు మరికొందరు నేతలు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో.. ఆయా స్థానాల్లో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుని, పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికి సముచిత స్థానం కల్పించడంతో పాటు వారికి పార్టీలో పెద్దపీట వేస్తామని భరోసా ఇస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో తోడున్నవాళ్లే పార్టీకి అవసరమని టికెట్ల కోసం పార్టీ మారే వారిని తాను ఎప్పుడూ ప్రోత్సహించనని.. సీనియర్లకు బాబు చెప్పినట్లు తెలుస్తోంది.

అసంతృప్త నేతలను బుజ్జగించడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్, కావ్య కృష్ణారెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డితో పాటు మరికొందరు నేతలు చంద్రబాబును కలిశారు. త్వరలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి వస్తారన్న వార్తలతో… వీరంతా బాబుతో భేటీ అయ్యారు. కావలి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కావ్య కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. పెల్లకూరు శ్రీనివాస్ రెడ్డి కొవ్వూరు టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం సైతం మంగళవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆనం వెంకటగిరి సీటు ఆశిస్తుండగా.. ఆయనను ఆత్మకూరు నుంచే పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందరినీ పిలిచి మాట్లాడినా.. అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయం ఫైనల్ అని పార్టీ నేతలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అన్ని నియోజకవర్గాల్లో.. ప్రచారం ముమ్మరం చేయాలని నేతలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. ఎన్నికలకు కొద్ది వారాల సమయం మాత్రమే ఉండటంతో జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపికతో పాటు,.. పార్టీ సీనియర్లతో చర్చించి విభేదాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..