పవన్ కోసం తన సీటు త్యాగం చేస్తానన్న అభ్యర్థి.. పొత్తుకు ముందే మారుతున్న రాజకీయం..

అనంతపురం అర్బన్‌లో అయితే నేను.. లేదంటే పవన్..మూడోవ్యక్తికి ఛాన్సే లేదంటున్నారు ప్రభాకర్‌ చౌదరి. జనసేన మాత్రం..అదెలా కుదురుతుందని ప్రశ్నిస్తోంది. ఇంతకూ అనంత అర్బన్‌లో టీడీపీ-జనసేనల పంచాయితీ ఏంటి..? పొత్తు పొడవక ముందే రచ్చ ఎందుకు రేగింది? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి ఏపీ పార్టీలు. ఈ రేసులో అధికార పార్టీ ముందుండగా.. టీడీపీ, జనసేనల మధ్య ఇంకా పొత్తు చర్చలు కొలిక్కిరాలేదు.

పవన్ కోసం తన సీటు త్యాగం చేస్తానన్న అభ్యర్థి.. పొత్తుకు ముందే మారుతున్న రాజకీయం..
Mla Prabhakar Chowdary
Follow us
Srikar T

|

Updated on: Feb 15, 2024 | 9:08 AM

అనంతపురం అర్బన్‌లో అయితే నేను.. లేదంటే పవన్..మూడోవ్యక్తికి ఛాన్సే లేదంటున్నారు ప్రభాకర్‌ చౌదరి. జనసేన మాత్రం..అదెలా కుదురుతుందని ప్రశ్నిస్తోంది. ఇంతకూ అనంత అర్బన్‌లో టీడీపీ-జనసేనల పంచాయితీ ఏంటి..? పొత్తు పొడవక ముందే రచ్చ ఎందుకు రేగింది? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి ఏపీ పార్టీలు. ఈ రేసులో అధికార పార్టీ ముందుండగా.. టీడీపీ, జనసేనల మధ్య ఇంకా పొత్తు చర్చలు కొలిక్కిరాలేదు. కానీ కొన్ని సెగ్మెంట్లలో రెండు పార్టీల నేతల మధ్య సీటు ఫైట్‌ మొదలయింది. అనంతపురం అర్బన్‌లో తానే అభ్యర్థినని ఇప్పటికే ప్రకటించుకున్నారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ప్రభాకర్‌ చౌదరి. అయితే పొత్తు తేలకముందే అభ్యర్థిగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. దీంతో పవన్‌ కల్యాణ్‌ అనంతపురం అర్బన్‌లో పోటీ చేస్తే.. తన సీటు త్యాగం చేస్తానని ప్రకటించారు ప్రభాకర్‌ చౌదరి. పవన్‌ తప్ప ఇంకెవరు పోటీ చేసినా..తగ్గేదే లేదంటున్నారు.

అనంత అర్బన్‌లో టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి..బలమైన నేతగా గుర్తింపు ఉంది. తనకు టికెట్‌ ఇస్తే..అనంతలో ఈసారి టీడీపీ జెండా కచ్చితంగా ఎగరెస్తానని చెబుతున్నారాయన. అయితే స్థానికంగా బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో జనసేన పార్టీ ఈ సీటుపై ఆశలు పెట్టుకుంది. స్థానిక జనసేన నేత టీసీ వరుణ్ టికెట్‌ ఆశిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణే ఇక్కడ నుంచి పోటీచేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. దాంతో అనంత అర్బన్‌ రాజకీయం ఆసక్తిగా మారింది. చంద్రబాబు, పవన్‌ మధ్య ఓ వైపు పొత్తు చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల పంచాయతీ ఇంకా కొలిక్కిరాలేదు. అయినా కొంతమంది నేతలు తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకోవడంతో రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. అభ్యర్థుల ఖరారు ఇంకా ఆలస్యం అయితే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. మరి అగ్రనేతలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..