అప్పులపై తప్పుడు లెక్కలు.. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా? – వైఎస్‌ జగన్

వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఆరోగ్యశ్రీ చికిత్సలు పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచామన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

అప్పులపై తప్పుడు లెక్కలు.. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా? - వైఎస్‌ జగన్
Ys Jagan Mohanreddy
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 20, 2024 | 5:47 PM

నాలుగు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా బడ్జెట్ ప్రవేశపెట్టారని, అసలు లెక్కలు బయటపెట్టాల్సి వస్తుందనే ఆలస్యంగా పెట్టారని ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి సర్కార్‌ అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు.

ముఖ్యంగా బడ్జెట్‌ చూస్తే బాబు ఆర్గనైజ్డ్ క్రైమ్‌ తెలుస్తున్నట్లు కనిపిస్తోందని, హామీలు ఎగొట్టడానికి బాబు అబద్ధాలకు రెక్కలు కట్టారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు అన్నీ వక్రీకరించి అబద్ధాలు చెబుతున్నారన్నారు. బాబు హయాంలో కన్నా వైఎస్సార్‌సీపీ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని జగన్‌ స్పష్టం చేశారు. జాతీయ సగటు కన్నా ఏపీ సగటు వృద్ధి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. లేని అప్పులు ఉన్నట్టుగా అబద్ధాలకు రెక్కలు కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదన్న జగన్‌,

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా లక్షా 30వేలు ఉద్యోగాలు ఇచ్చామని, ఆర్టీసీలో 50 వేల ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసి, ఆర్టీసీ కార్మికుల్లో వెలుగులు నింపామన్నారు. 2.66 లక్షల వలంటీర్ల నియామకాలు చేశామన్న జగన్‌, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని జగన్‌ ప్రశ్నించారు.

వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఆరోగ్యశ్రీ చికిత్సలు పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచామన్నారు. గత 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని 108 ఉద్యోగాలు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆరు నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌ పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు.

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతున్నాయన్న జగన్‌, 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి 2లక్షల 57వేల కోట్ల అప్పులు, 2019నాటికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న అప్పులు 55వేల కోట్లు, మొత్తం కలిపి 3లక్షల 13వేల కోట్ల అప్పులు ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. మేం దిగిపోయే నాటికి 4లక్షల 91వేల కోట్ల అప్పులు, ప్రభుత్వ గ్యారంటీ అప్పులు లక్షా 54వేల వేల కోట్లు, మొత్తం కలిపి 6లక్షల 46వేల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయన్నారు. 2023 -24 కాగ్ రిపోర్ట్ కూడా 6లక్షల 46వేల కోట్ల అప్పులని చెప్పిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పులు ప్రభుత్వ ఖాతాల్లోకి రావన్న జగన్‌, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలుపుకున్నా వైసీపీ హయాంలోనే తక్కువ అన్నారు. అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వల్లిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు హయాంలో ఒక్క నిరుపేదకు కూడా సెంటు స్థలం ఇవ్వలేదని విమర్శించిన జగన్‌, వైసీపీ హయాంలో 9లక్షల 2వేల ఇళ్లను మేం పూర్తి చేశామన్నారు. ఇంకో 11లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో హౌసింగ్ పథకం నిలిచిపోయింది. అంతేకాదు ప్రజలకు అవసరమైన పనులన్నీ స్థంభించిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి చోటా మాఫియా ముఠాలు బయలుదేరాయన్న జగన్‌, ఇసుక, మద్యం స్కామ్, పేకాట క్లబ్బులు తయారయ్యాయని ఆరోపించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ పేరుతో మాపై దుష్ప్రచారం చేశారు. మా హయంలో 34 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని ఈ హోంమంత్రే స్వయంగా చెప్పారని జగన్‌ తెలిపారు.

రాష్ట్రంలో అక్రమ అరెస్టులతో రాజ్యాన్ని నడుపుతున్నారని ఆరోపించిన జగన్, అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ ప్రయోగాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారన్నారు. న్యాయ ప్రక్రియను ఆలస్యం చేయడానికి ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడం లేదన్నారు. సెన్సార్ బోర్డ్ అనుమతితో ఆర్జీవీ సినిమాలు తీసినా కేసులు పెడుతున్నారు. దళిత నేత నందిగం సురేష్‌పై కేసుల మీద కేసులు పెడుతున్నారని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్