Srisailam: కార్తీక మాసం వేళ మల్లన్నకు పెరిగిన హుండీ ఆదాయం.. భారీగా విదేశీ కరెన్సీ..
అష్టాదశ శక్తి పీఠాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ క్షేత్రం శ్రీశైలం. శ్రీ గిరిపై భ్రమరాంబ మల్లికార్జున స్వామిలుగా ఆది దంపతులు కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు మల్లన్న ఆలయానికి పోటెత్తారు. అదే సమయంలో ఆలయ హుండీకి వివిధ దేశాల కరెన్సీలు వెల్లువెత్తయి. వాటితో పాటు దేశీయ కరెన్సీ కూడా పెద్ద ఎత్తున రావడంతో మల్లన్న ఆదాయం పెరిగింది
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 14 లక్షల 15 వేల 623 రూపాయల నగదు భక్తుల కానుకల ద్వారా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు ఈ ఆదాయాన్ని గత 26 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు వెల్లడించారు. ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు 322 గ్రాముల 300 మిల్లి గ్రాములు బంగారం అదే విధంగా 8 కేజీల 500 గ్రాములు వెండి కానుకలుగా లభించాయని చెప్పారు.
నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 739, యూఏఈ దిర్హమ్సు 50, ఈరోస్ 20, ఆస్ట్రేలియా డాలర్లు 135, కెనడా డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 205, కత్తారు రియాల్స్ ఓమన్ రియాల్స్ 2, ఓమన్ బైసా 600, మలేషియారింగిట్స్ 2, బహ్రెన్ దినార్ 1, ఘనా సీడిస్ 200, ఉగాండ షిల్లింగ్సు 1000, జపాన్ యన్స్ 116, మెక్సికో పిసో 1020 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..