AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఇంట్లో ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి

ఇల్లు కట్టుకునే సమయంలో కొన్ని వాస్తు నియమాలను తప్పని సరిగా పాటించాలి. అదే సమయంలో ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా ఈ నియమాలను పాటిస్తే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తొలగించడంలో సహాయపడడానికి కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించవచ్చు. అవి ఏమిటంటే

Vastu Tips: మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఇంట్లో ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి
Vastu Tips For Home
Surya Kala
|

Updated on: Nov 20, 2024 | 6:51 PM

Share

ఇంటి వాస్తు ఆరోగ్యం, సంపద, అతని నివాస స్థలాన్ని సమానంగా ప్రభావితం చేస్తుంది. సభ్యుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో ఇంటి వాస్తు, ఫర్నిచర్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన మందరం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం ప్రశాంతమైన ఇంటిని కోరుకుంటున్నాము. కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా ఆహ్లాదకరమైన వాతారణంలో ఉండవచ్చు. ప్రశాంతమైన శక్తిని పొందవచ్చు. పనిలో అలసిపోయిన రోజు తర్వాత మనం మానసిక ప్రశాంతత, విశ్రాంతి కోసం ఇంట్లోనే ఉండాలనుకుంటాం. అటువంటి పరిస్థితిలో కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించవచ్చు. ఇవి జబ్బులు, మానసిక వేదన, నెగటివ్ ఎనర్జీని నివారించి మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పెంపొందించడానికి సహాయపడతాయి.

సాధారణ వాస్తు చిట్కాలు

  1. ఈశాన్య దిశలో ప్రతిరోజూ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది.
  2. నీటి కుళాయి నిరంతర చినుకులు కారుతుంటే ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లో కుళాయి నుంచి నీరు కారకుండా చూసుకోండి.
  3. మెట్ల కింద ఉన్న స్థలాన్ని టాయిలెట్, స్టోర్ లేదా కిచెన్‌గా ఉపయోగించడం వల్ల నాడీ వ్యాధులు, గుండె జబ్బులు వస్తాయి.
  4. చదువుతున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు ముఖం పెట్టండి. ఇది మంచి జ్ఞాపకశక్తిని ఇచ్చేలా చేస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తులసి మొక్కలు నాటడం వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుంది. ఇంట్లో కాక్టస్ , ముళ్ళ మొక్కలను పెంచుకోవద్దు. ఇవి మీ అనారోగ్యాన్ని, ఒత్తిడిని పెంచుతాయి.
  7. ఇంటికి ఈశాన్య మూలలో మెట్లు లేదా మరుగుదొడ్డి నిర్మించవద్దు. ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పిల్లల అభివృద్ధిని అడ్డుకుంటుంది.

పడకగది వాస్తు చిట్కాలు

  1. నైరుతి దిశలో మాస్టర్ బెడ్‌రూమ్ శారీరక , మానసిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఈశాన్య దిశలో ఎప్పుడూ పడకగదిని నిర్మించవద్దు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
  2. పడుకునేటప్పుడు ఎప్పుడూ దక్షిణం వైపు తల పెట్టి పడుకోండి. ఇది ప్రశాంతమైన , ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం మంచిది కాదు.ఇది ఒత్తిడిని, నొప్పిని కలిగిస్తుంది.
  3. గర్భస్రావం జరగకుండా ఉందాలంటే గర్భిణీ స్త్రీ ఈశాన్య దిశలో పొరపాటున కూడా నిద్ర పోవద్దు.
  4. కాంతి కిరణాల క్రింద నిద్రించడం మానుకోండి ఎందుకంటే ఇది నిరాశను కలిగిస్తుంది. తలనొప్పి, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.
  5. బెడ్ రూమ్ లోని మంచం ఎదురుగా అద్దం ఉంచవద్దు. ఇది పీడకలలకు దారితీస్తుంది.
  6. మంచాన్ని టాయిలెట్ గోడతో ఎప్పుడూ సమానంగా ఉంచ వద్దు. ఇది ప్రతికూల శక్తి ని తెస్తుంది.
  7. మంచి నిద్ర పొందడానికి, మొబైల్ ఫోన్‌లు , ఇతర గాడ్జెట్‌లను మంచం నుంచి దూరంగా ఉంచండి.

ఆరోగ్యానికి వంటగది వాస్తు చిట్కాలు

  1. ఆగ్నేయ దిశ వంటగదికి మంచిదని వాస్తు శాస్త్రం పేర్కొంది.
  2. తూర్పు దిశ వంట చేయడానికి, తినడానికి ఉత్తమ దిశగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది సమర్థవంతమైన జీర్ణక్రియ , మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
  3. టాయిలెట్, వంటగదిని కలిపి నిర్మించ వద్దు. రెండింటికీ ఒకదానికొకటి కలవ నంత దూరంలో నిర్మించుకోవాలి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.