Rambhadracharya: ఛాతీలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న స్వామి రామభద్రాచార్య.. ఆసుపత్రిలో జాయిన్.. ఆందోళన వద్దంటున్న వైద్యులు

తులసీ పీఠాధీశ్వర స్వామి రామభద్రాచార్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం రామభద్రాచార్యను డెహ్రాడూన్‌లోని సినర్జీ ఆస్పత్రిలో చేర్పించారు. షుగర్, హార్ట్ పేషెంట్ అయిన స్వామి రామభద్రాచార్య సాధారణ చెకప్‌కు వచ్చినట్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు.

Rambhadracharya: ఛాతీలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న స్వామి రామభద్రాచార్య.. ఆసుపత్రిలో జాయిన్.. ఆందోళన వద్దంటున్న వైద్యులు
Rambhadracharya Hospitalized
Follow us
Surya Kala

|

Updated on: Nov 20, 2024 | 5:41 PM

తులసీ పీఠాధీశ్వర స్వామి రామభద్రాచార్య ఛాతీ ఇన్ఫెక్షన్ తో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన్ని మంగళవారం డెహ్రాడూన్‌లోని సినర్జీ ఆసుపత్రిలో చేర్చించారు. పరీక్షల అనంతరం స్వామి రామభద్రాచార్య ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనకు చికిత్స కొనసాగుతోందని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ స్వామి రామభద్రాచార్య మధుమేహం, గుండె సంబంధిత రోగి. కనుక స్వామి రామభద్రాచార్య రొటీన్ చెకింగ్ కోసం ప్రతి ఆరు నెలలకోసారి డెహ్రాడూన్ వస్తారు. సినర్జీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కృష్ణ అవతార్ .. స్వామీ రామభద్రాచార్య విషయంపై మాట్లాడుతూ ప్రస్తుతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని.. రొటీన్ చెకప్ కోసమే వచ్చారని చెప్పారు.

చికిత్స అనంతరం ఆయన ఉపశమనం పొందారని అన్నారు. సమాచారం ప్రకారం రామభద్రాచార్యకు అప్పటికే మధుమేహ సమస్య ఉంది. ఇప్పుడు మారుతున్న వాతావరణం కారణంగా.. శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది మొదలైంది. దీంతో డెహ్రాడూన్‌లోని సినర్జీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.. స్వామీజీ ఆరోగ్య పరిస్థితి చూసి వైద్యులు అడ్మిట్‌ చేశారు. అన్ని పరీక్షలు చేసిన అనంతరం సినర్జీ హాస్పిటల్ MD డాక్టర్ కృష్ణ అవతార్ స్వామీ ఆరోగ్యం విషయంపై మాట్లాడుతూ ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పారు.

రామభద్రాచార్య షుగర్ పేషెంట్

ఆసుపత్రిలో చేరిన అనంతరం ఆయన ఉపశమనం పొందారు. అంతేకాదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య సమస్యలను చెక్ చేస్తామని.. ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయిందని చెప్పారు. స్వామీ ఆరోగ్యాన్ని పరిశీలించిన వైద్యులు అంతా సవ్యంగానే ఉందని ప్రకటించారు. త్వరలో డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మరోవైపు రామభద్రాచార్యులు అనారోగ్యానికి గురయ్యారనే వార్త తెలియడంతో ఆయనతో అనుబంధం ఉన్న భక్తులు ఆందోళనకు దిగారు.

ఇవి కూడా చదవండి

త్వరలో చిత్రకూట్ చేరుకోనున్న రామభద్రాచార్య

ప్రజలు తులసి పీఠానికి ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆశ్రమానికి కూడా భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అటువంటి పరిస్థితిలో రామభద్రాచార్య తన శ్రేయోభిలాషులకు ఆందోళన చెందవద్దని సందేశం ఇచ్చారు. రామభద్రాచార్య ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉందని త్వరలో డిశ్చార్జ్ అయ్యి చిత్రకూట్ చేరుకుంటారని అయన ఆరోగ్య విషయంలో ఆందోళన వద్దు అంటూ వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ