Srisailam: భక్తులకు అలర్ట్! ఈ విషయం తెలియకుండా వెళ్లొద్దు జాగ్రత్త!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో 2026 సంవత్సరానికి సంబంధించిన అఖిల భారత పులుల గణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మహా శివరాత్రి దృష్ట్యా ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు పాదయాత్రకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభమైన క్రమంలో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 3 కెమెరా ట్రాప్‌ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్‌లో ఫిబ్రవరి 13 వరకు పులుల గణన కొనసాగుతుందని పేర్కొన్నారు.
వెంకటాపురం-హటకేశ్వరం, పెచ్చెరువు-నాగలూటి మార్గంలో శ్రీశైలం పాదయాత్రపై ఫిబ్రవరి 8 వరకు నిషేధం విధిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో భక్తులు ఆత్మకూరు దోర్నాల రోడ్డు మార్గం వినియోగించాలని సూచించారు.
మహా శివరాత్రి దృష్ట్యా ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు పాదయాత్రకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అఖిల భారత పులుల గణన విజయవంతానికి భక్తులు సహకరించాలని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ కోరారు. అందుకే పాదయాత్రకు వెళ్లే భక్తులు అటవీ శాఖ ఆంక్షలను గమనించి వెళితే వారి యాత్ర సజావుగా సాగుతుంది.
కాగా, శ్రీశైలం పాదయాత్ర అంటే ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు నల్లమల అడవి గుండా సుమారు 48-50 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. ఇది వెంకటాపురం (ఆత్మకూరు దగ్గర) నుంచి ప్రారంభమవుతుంది. భక్తుల కోసం మార్గమధ్యంలో నాగలూటి, దమర్లకొంట, పెచ్చెరువు, భీముని కోల వంటి ప్రదేశాలలో ఆహారం, నీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు.
