Guntur: ఆ ఆసుపత్రికి క్యూ కడుతున్న విదేశీయులు.. ఆన్ లైన్‌లో వెదికి మరీ.. ఎందుకో తెలుసా..

Best Neurosurgeon: గుంటూరు ఆసుపత్రిపై విదేశీయులు ద్రుష్టి సారించారు. ఇప్పటికే ఇరు దేశాలకు చెందిన రోగులు ఆ ఆసుపత్రిలోనే ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఆన్ లైన్ లో డాక్టర్ అడ్రస్ వెతికి మరి వైద్యం చేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఆ ఆసుపత్రి స్పెషల్ ఏంటనుకుంటున్నారా... అయితే ఈ స్టోరీ చదవండి

Guntur: ఆ ఆసుపత్రికి క్యూ కడుతున్న విదేశీయులు.. ఆన్ లైన్‌లో వెదికి మరీ.. ఎందుకో తెలుసా..
Neurosurgeon Dr. Mohana Rao
Follow us
T Nagaraju

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 15, 2023 | 8:21 PM

గుంటూరు, 15 సెప్టెంబర్:  గుంటూరు కొత్తపేటలోని ఆ ఆసుపత్రి పేరు రావూస్ హాస్పటిల్.. ఇప్పడు ఆ ఆసుపత్రి గురించి ఆన్ లైన్ లో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగింది. అలా సెర్చ్ చేసిన ఇద్దరు విదేశీయులు ఏకంగా ఆపరేషన్ చేయించుకునేందుకు గుంటూరు కూడా వచ్చారు. యూకే, నెదర్లాండ్స్ కు చెందిన ఆ ఇద్దరికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. రెండు మూడు రోజుల్లో వారు ఢిశ్చార్జ్ కానున్నారు. వీరిద్దరూ కుషింగ్ డీసీజ్ తో బాధపడుతున్నారు. ఈ రోగం ఉన్న వారిలో సీరం కార్డిసాల్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయి అనారోగ్యాలను కల్గిస్తుంది. శరీరంలో కణుతులు పేరుకుపోయి మరణం కూడా సంభవిస్తుంటుంది.

ఈ రోగంపై డాక్టర్ పాటిబండ్ల మోహన్ రావు రీసెర్చ్ చేశారు. ఈవ్యాధిపై దాదాపు వందకు పైగా ఆర్టికల్స్ ను వివిధ మెడికల్ జర్నల్స్ లో రాశారు. దీంతో విదేశీయులు సైతం డాక్టర్ మోహన్ రావు గురించి తెలుసుకొని వైద్యం కోసం గుంటూరుకు వస్తున్నారు. మొదట గూగుల్ లో వెతికి డాక్టర్ మోహన్ రావు ఫోన్ నంబర్ సాధించారు. ఆయనకు ఫోన్ చేసి శస్త్ర చికిత్స చేస్తానని చెప్పిన తర్వాత ఆ ఇద్దరు రోగులు గుంటూరు వచ్చారు. ఎండో స్కోపి, స్టీరియో టాక్టిక్ అనే రెండు సర్జరీల ద్వారా కణితులను తొలగించారు. ప్రస్తుతం ఆ రోగులు ఇద్దరూ పూర్తిగా కోలుకున్నారు.

బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన మోహన్ రావు హైదరాబాద్ నిమ్స్ లో పిజీ పూర్తి చేశారు. అనంతరం విదేశాల్లో సూపర్ స్పెషాలిటి కోర్సులను చదివారు. 2013 నుండి 2020 వరకూ అమెరికాలో పనిచేశారు. అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందటంతో విదేశీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బెస్ట్ న్యూరోసర్జన్ గ్రహిత..

ప్రతిష్టాత్మక “బెస్ట్ న్యూరోసర్జన్ , స్పైన్ సర్జన్ ఇన్ ఇండియా” అవార్డుతో సత్కరించారు. 19 ఆగస్టు 2023న బిజోక్స్ మీడియా నెట్‌వర్క్ నిర్వహించిన లీడర్స్ అవార్డ్స్ 2023 సందర్భంగా ఈ గుర్తింపు అతనికి అందించబడింది. న్యూరోసర్జరీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన విశేషమైన కృషి, అంకితభావంతో చేయన చేస్తున్న వైద్య సేవకు ఈ అవార్డు దక్కింది.

హైదరాబాద్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి..

డాక్టర్ మోహన్ రావు హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి న్యూరోసర్జరీలో స్పెషలైజేషన్‌తో సహా వివిధ డిగ్రీలు, ఫెలోషిప్‌లను అందుకున్నారు. వీటిలో మినిమల్లీ ఇన్వాసివ్ స్కల్ బేస్ సర్జరీ, పీడియాట్రిక్ న్యూరోసర్జరీ, న్యూరో-ఆంకాలజీ, ఫంక్షనల్, స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ, ఎండోవాస్కులర్ న్యూరోసర్జరీ సెరెబ్రోవాస్కులర్ విధానాలలో ఫెలోషిప్‌లు పొందారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం