AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: పొత్తు వల్ల జనసేనకు లాభముందా? తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం ఏంటి?

Big News Big Debate: పొత్తు వల్ల జనసేనకు లాభముందా? తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం ఏంటి?

Ram Naramaneni
|

Updated on: Sep 15, 2023 | 9:07 PM

Share

టీడీపీతోనే జనసేన పొత్తు ఉంటుందన్న ప్రకటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అటు జనసేన- టీడీపీ కార్యకర్తలు గెలిచినంత ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అటు వైసీపీ సరికొత్త వ్యూహాలపై దృష్టి పెట్టింది. వైసీపీని ఓడించాలంటే అందరూ ఏకం కావాలంటున్న పవన్‌ అడుగు ముందుకేశారని మిత్రపక్షాలు అంటుంటే.. 75శాతం ప్రజల మద్దతు తమకే ఉందని పాజిటివ్‌ ఓటు వల్ల విజయం తమదేనన్న వైసీపీ చెబుతోంది.

టీడీపీతోనే జనసేన పొత్తు ఉంటుందన్న ప్రకటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అటు జనసేన- టీడీపీ కార్యకర్తలు గెలిచినంత ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అటు వైసీపీ సరికొత్త వ్యూహాలపై దృష్టి పెట్టింది. వైసీపీని ఓడించాలంటే అందరూ ఏకం కావాలంటున్న పవన్‌ అడుగు ముందుకేశారని మిత్రపక్షాలు అంటుంటే.. 75శాతం ప్రజల మద్దతు తమకే ఉందని పాజిటివ్‌ ఓటు వల్ల విజయం తమదేనన్న వైసీపీ చెబుతోంది. పవన్‌ కల్యాణ్‌ పొత్తు ప్రకటన అనంతరం ప్రకంపనలు ఏపీలో ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఇరు పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేస్తున్న దీక్షలకు జనసేన మద్దతు ప్రకటించడమే కాదు.. తెలుగుదేశం కండువాలు వేసుకుని మరీ దీక్షలో పాల్గొంటున్నాయి శ్రేణులు. అటు పొత్తు కుదరడంపై ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ఏకంగా కేక్‌ కట్‌ చేసి మరీ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అంటోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్‌ కూడా దక్కదంటోంది తెలుగుదేశం. వైసీపీ నాయకులు పూర్తి నిరాశ, నిసృహలో ఉన్నారంటోంది టీడీపీ.

టీడీపీ, జనసేన బంధం ఫెవికాల్ లాగా అతుక్కుని బలంగా ఉందని.. తాజా ప్రకటన కొత్తేమీ కాదంటోంది వైసీపీ. 2014 నుంచే రెండు పార్టీలు కలిసి ఉన్నాయని ఆరోపించారు మంత్రి జోగి రమేష్‌. ప్యాకేజీ స్టార్‌ అని మరోసారి పవన్‌ నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు మరో మంత్రి ఆర్కే రోజా. మొత్తానికి పొత్తులపై పార్టీల్లో లెక్కలు మొదలయ్యాయి. ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటూ నేతల మధ్య చర్చలూ సాగుతున్నాయి.. ఇంతకీ ఎవరికి ప్లస్‌.. మరెవరికి మైనస్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Sep 15, 2023 07:02 PM