Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulichintala: పులిచింతలకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన గేటు.. దిగువ ప్రాంతాల్లో హైఅలర్ట్..

పులిచింతల వరద ఇప్పట్లో ఆగేట్టు కనిపించడం లేదు. స్టాప్​లాక్ గేటు ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో.. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో సమస్య తీవ్రంగా మారుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.

Pulichintala: పులిచింతలకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన గేటు.. దిగువ ప్రాంతాల్లో హైఅలర్ట్..
Pulichintala
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 05, 2021 | 10:11 PM

పులిచింతల గేట్లను ఆపరేట్ చేసే టూనియల్ గడ్డర్స్‌.. విరగడంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్ దగ్గరకెళ్లిన ఎక్స్‌ఫర్ట్ టీములు అక్కడేం జరిగిందో పరిశీలించాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్టాప్ గేట్ అమర్చేందకు ఇబ్బందులు ఎదురువుతున్నట్టు చెప్పారు టెక్నీషియన్లు. సాగర్ నుంచి పులిచింతలకు సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. పులిచింతల నుంచి కూడా 4 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 5 మీటర్లకు చేరుకోగానే.. స్టాప్ లాక్ గేట్ అమరుస్తామని అంటున్నారు అధికారులు.

ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే కమిటీని నియమించింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి అనిల్ కమార్ యాదవ్. 2004లో ప్రారంభించిన పులిచింతల ప్రాజెక్టు 2013లో పూర్తయ్యింది. 45 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సాగింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి స్తాయి నీటి నిల్వ చేశారు. ఇప్పుడు గేటు విరిగిపోవడంతో డ్యామ్ నాణ్యతపై అనుమానాలు ఏర్పడుతున్నాయి.

ఇదిలావుంటే.. పులిచింతల ప్రాజెక్టు వద్ద సాంకేతిక సమస్యతో ఊడిన 16వ గేటు వద్ద సమస్య పరిష్కారానికి స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయుటకు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. గురవారం రాత్రి 7.30 గంటల సమయానికి పులిచింతల వద్ద ఔట్ ఫ్లో 5,02,216 క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజ్ ఔట్ ఫ్లో 1,33,939 క్యూసెక్కులు ఉందని చెప్పారు.

ఈ రోజు రాత్రి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. అధికారుల అంచనా ప్రకారం 6 లక్షల క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. కృష్ణానది నీటి ప్రవాహం చేరుతున్నందున ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలకు అందుబాటులో ఉందన్నారు. అవసరమైతే అత్యవసర సేవలకు సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజలు సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలన్నారు.కృష్ణానదీ తీరం వెంబడి అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరదను వదిలే యత్నం చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. ప్రకాశం బ్యారేజీ స్టోరేజ్ వాటర్‌ను దిగువకు విడుదల చేస్తున్నారు. వరద హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి : Yoga Mat: లాభాలు కురిపిస్తున్న గుర్రపుడెక్క.. వీటితో భారీ బిజినెస్.. సంపాదన మార్గంగా మారిన పనికిరాని మొక్క..

IND vs ENG 1st Test Day 2 Live: తొలి రోజు టీమిండియా పేస్ పంచ్‌.. ఇవాళ బ్యాటింగ్ బౌండరీలు చూద్దాం..