Mid Day Meal: ఆంధ్రప్రదేశ్‌లో ‘మిడ్ డే మీల్’ పథకం కింద 19 వేల కిచెన్లు రెడీ : కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్) కింద 19 వేల కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర
Mid Day Meal kitchens: ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్) కింద 19 వేల కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 2006–07 నుంచి 2019–20 మధ్య కాలంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 44,316 కిచెన్ కమ్ స్టోర్‌లను మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఒక్క కిచెన్ కమ్ స్టోర్ నిర్మాణానికి 60 వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పిన ఆయన, ఈ మొత్తం ఏమూలకు సరిపోవడం లేదంటూ ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు వీటి నిర్మాణానికి ఆసక్తి చూపకపోవడంతో 2009 డిసెంబర్ నుంచి కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణ వ్యయాన్ని సవరించడం జరిగిందని కేంద్రమంత్రి తెలిపారు.
రాజ్యసభలో ఇవాళ వైయస్‌ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ పథకం కింద కిచెన్ కమ్ స్టోర్ నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. యూనిట్ నిర్మాణానికి అయ్యే ఖర్చుకు బదులుగా వాటిని నిర్మించే ప్లింత్ ఏరియాను బట్టి చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
సవరించిన నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన కిచెన్ కమ్ స్టోర్స్‌ను నిర్మించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగిందని కేంద్రమంత్రి చెప్పారు. ఇప్పటి వరకు నిర్మించినవి కాకుండా కొత్తగా చేపట్టే వాటిని నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా సొంత నిధులతో నిర్మిస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపినట్లు కేంద్రమంత్రి సభకు తెలిపారు.