Andhra: కాలువలో తేలియాడుతూ కనిపించిన శవం.. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే.. ఊహించని ట్విస్ట్
అసలే 3 రోజుల నుంచి జోరు వాన.. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కాలువ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలోని ముళ్ల కంచెల వద్ద ఓ మృతదేహం ఆనవాలు కనిపించింది. కాలు మాత్రమే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అధికారులకు, పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత.....

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. స్థానిక ఈస్ట్రన్ కాలువలో తేలియాడుతున్న శవాన్ని చూసి స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలువ ప్రవాహం ఉదృతంగా ఉంది. చెట్ల మధ్య మాత్రమే కనిపిస్తున్న ఆ శవం కాలు మాత్రమే కనిపించడంతో.. ఎవరైనా ప్రమాదవశాత్తూ కొట్టుకపోయారేమో లేక ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారేమో అనుకున్నారు.
స్థానికులు వెంటనే పోలీస్, పంచాయితీ సిబ్బందికి సమాచారం అందించారు. కాలువ వద్దకు పెద్దసంఖ్యలో గ్రామస్తులు చేరి ఆ శవం ఎవరికంటే అనేది చర్చలో పడ్డారు. అంతలో ఓ వ్యక్తి ధైర్యం చేసి కాలువలోకి దిగి.. ఆ ప్రాంతానికి వెళ్లి కనిపిస్తున్న కాలును పట్టుకుని లాగాడు. ట్విస్ట్ ఏంటి అంటే అది శవం కాదు. ఓ చెక్క బొమ్మ. నీటి ఉధృతికి ఎక్కడినుంచో కొట్టుకువచ్చి అక్కడ చిక్కుకుని ఆగిపోయింది. దీంతో స్థానికులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
వీడియో దిగువన చూడండి…
Also Read: చేప అనుకుని చేతుల్తో పట్టి ఒడ్డున వేశారు.. తీరా చూస్తే.. ఓర్నాయనో..
