AP Politics: సై..అంటే సై..! సిద్ధం అంటే.. మేం సిద్ధమే.. ఇంతలోనే పోలీసుల ఎంట్రీ.. ఏపీలో హీటెక్కిస్తున్న ఫ్లెక్సీ వార్..
సై..అంటే సై..! ‘సిద్ధం’ అంటే.. మేం సిద్ధమే.. అంటూ ఎన్నికలకు ముందే పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి ఏపీలోని ప్రధాన పార్టీలు. ఎన్నికల కోడ్ రాకున్నా.. నిత్యం అధికార వైసీపీ, విపక్ష టీడీపీ-జనసేన పార్టీల మధ్య మాటలయుద్ధమే కాదు.. ఇప్పుడు ఫ్లెక్సీవార్ కూడా నడుస్తోంది. విజయవాడలో ఫ్లెక్సీ వార్ కొనసాగుతుండంగానే.. తాజాగా కృష్ణాజిల్లా గుడివాడలో ఫ్లెక్సీ వార్ పీక్స్‌కి చేరింది.
సై..అంటే సై..! ‘సిద్ధం’ అంటే.. మేం సిద్ధమే.. అంటూ ఎన్నికలకు ముందే పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి ఏపీలోని ప్రధాన పార్టీలు. ఎన్నికల కోడ్ రాకున్నా.. నిత్యం అధికార వైసీపీ, విపక్ష టీడీపీ-జనసేన పార్టీల మధ్య మాటలయుద్ధమే కాదు.. ఇప్పుడు ఫ్లెక్సీవార్ కూడా నడుస్తోంది. విజయవాడలో ఫ్లెక్సీ వార్ కొనసాగుతుండంగానే.. తాజాగా కృష్ణాజిల్లా గుడివాడలో ఫ్లెక్సీ వార్ పీక్స్‌కి చేరింది. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. అందుకు కౌంటర్‌గా సై అంటూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించేందుకు ప్రయత్నించడంతో టీడీపీ, జనసేన నేతలు అక్కడికి చేరుకున్నారు. పెద్దయెత్తున పార్టీ శ్రేణులు రావడంతో మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరిన టీడీపీ-జనసేన నేతలు నెహ్రూ చౌక్ సెంటర్‌కు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.
ఇక బెజవాడలోనూ జనసేన, వైసీపీల మధ్య ఫ్లెక్సీవార్ ముదురుతోంది. సిద్ధం అంటూ రెండు పార్టీల ఫ్లెక్సీలు కృష్ణలంక జాతీయ రహదారిపై వెలిశాయి. జనసేనకు సవాల్ విసురుతూ రాత్రి.. మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. వై నాట్ 175 అంటూ బ్యానర్ పెట్టారు. గెలవడానికి మేము సిద్ధం పోటీ చేయడానికి మీరు సిద్ధమా అంటూ జనసేనకు కౌంటర్‌గా ఫ్లెక్సీ పెట్టారు వైసీపీ నేతలు. మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల సమీపంలోనే కౌంటర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అధికార-విపక్షాల నేతలు ఫ్లెక్సీల విషయంలో ఎవరికి వారు తగ్గేదే లే అంటున్నారు. మరి ఇప్పుడు జనసేన ఏం చేస్తుందన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తుండగా.. సీన్‌లోకి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఎంట్రీ ఇచ్చారు. కృష్ణలంక జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన జనసేన, వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. పర్మిషన్ తీసుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని.. లేకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అంతేకాకుండా.. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకుండా పోలీస్ పికెట్ ను కూడా ఏర్పాటుచేశారు. ఎన్నికలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని అటు రాజకీయ నేతల్లో.. ఇటు ప్రజల్లో చర్చ జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..