Flexi fight: అమరావతి రైతుల మహాపాదయాత్రకు వైసీపీ కౌంటర్.. బాపట్ల జిల్లాలో వెలిసిన ఫ్లెక్సీలు..

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో అమరావతి రైతుల పాదయాత్ర కు వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు పెట్టారు. నిన్న వేమూరు నియోజకవర్గంలో ఇలాంటివి కనిపిస్తే.. ఇప్పుడు రేపల్లెలో వికేంద్రీకరణకు మద్దతుగా బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టారు..

Flexi fight: అమరావతి రైతుల మహాపాదయాత్రకు వైసీపీ కౌంటర్.. బాపట్ల జిల్లాలో వెలిసిన ఫ్లెక్సీలు..
Amaravati Farmers Padayatra
Follow us

|

Updated on: Sep 16, 2022 | 1:29 PM

అమరావతి రైతుల మహాపాదయాత్రకు వైసీపీ నుంచి ప్రతిఘటన పెరుగుతోంది. పాదయాత్రకు నిరసనగా దారిపొడవునా వెలసిన ఫ్లెక్సీలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ బాపట్ల జిల్లా రేపల్లెలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. 29 గ్రామాలతో మనం మాత్రమే బాగుపడుదామా? లేక.. 26 జిల్లాల అభివృద్ధితో తెలుగుజాతిని నిలబెడుదామా? దయచేసి ఆలోచించాలంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నిస్తున్నారు. నిన్న వేమూరు నియోజకవర్గంలో ఇలాంటివి కనిపిస్తే.. ఇప్పుడు రేపల్లెలో వికేంద్రీకరణకు మద్దతుగా బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులే సరైన నిర్ణయమంటూ ఫ్లెక్సీల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. గ్రాఫిక్స్‌ పాలన వద్దు.. సంక్షేమపాలనే ముద్దంటూ వెలసిన ఫ్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

వైసీపీ వ్యతిరేకిస్తున్నా.. ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నా.. ఇవేమీ పట్టించుకోకుండా అమరావతి మహాపాదయాత్ర కొనసాగుతోంది. అమరావతినే రాజధానికి చేయాలంటూ సాగుతున్న యాత్ర.. బాపట్ల జిల్లా రేపల్లెకు చేరుకుంది.అందరి రాజధాని అమరావతేనంటూ నినాదాలతో హోరెత్తుస్తున్నారు రైతులు.

కొల్లూరు నుంచి ప్రారంభమైన ఐదో రోజు పాదయాత్ర.. భట్టిప్రోలులో ముగియనుంది. పాదయాత్రకు మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, సీపీఐ ముప్పాళ్ల నాగేశ్వరరావు రైతుల పాదయాత్రకు మద్దతు పలికారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..