AP Crime: చేపల వేటకు వెళ్లి.. అలల ఉద్ధృతిలో చిక్కుకుని.. చివరికి..
సముద్రంలో చేపల వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూలాగే వేటకు వెళ్లిన అతను.. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని మృత్యువాత పడ్డాడు. మరో పది నిమిషాల్లో...
సముద్రంలో చేపల వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూలాగే వేటకు వెళ్లిన అతను.. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని మృత్యువాత పడ్డాడు. మరో పది నిమిషాల్లో క్షేమంగా ఒడ్డుకు చేరతామనుకుంటుండగా సముద్రం అలలు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను బాగా చదివించేందుకు వచ్చే ఏడాది విశాఖపట్నం వెళ్దామని చెప్పారని, ఇలా మధ్యలోనే తమను వదిలి వెళ్లిపోతారని అనుకోలేదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. విజయనగరం(Vizianagaram) జిల్లా భోగాపురం(Bhogapuram) మండలంలోని ముక్కాం గ్రామానికి చెందిన వాసుపల్లి ఎల్లయ్య.. సముద్రంలో చేపలు పట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
రోజువారీ మాదిరిగానే సోమవారం ఉదయం మూడు గంటలకు సహచరులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లారు. చేపలు పట్టి, తిరిగి వస్తున్న సమయంలో సముద్రంలో అలల తీవ్రత ఎక్కువైంది. దీంతో వారు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ ఘటన నుంచి అతికష్టం మీద అందరూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే తీరానికి చేరుకున్న వారికి ఎల్లయ్య ఆచూకీ కనిపించలేదు. దీంతో ఎల్లయ్య కోసం తోటి మత్స్యకారులు గాలించారు. కాసేపటికి సముద్రంలో ఎల్లయ్య మృతదేహం లభ్యమైంది. తలకు బలమైన గాయమై మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధరించారు. ఆయన మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఎల్లయ్యకు భార్య అప్పయ్యమ్మ, పిల్లలు మానస, హరి ఉన్నారు.
Also Read
Corbevax Vaccine: కరోనాపై పోరులో మరో ముందడుగు.. పిల్లల కోసం అందుబాటులోకి మరో కొవిడ్ టీకా..
Viral Video: కుక్కను ముద్దులతో ముంచెత్తిన పిల్లి !! వీడియో వైరల్
మహిళ పైకి కారు ఎక్కించి వ్యక్తి !! సోషల్ మీడియాలో వీడియో వైరల్