Viral Video: ‘జై శ్రీరామ్’ నినాదాల హోరు.. ఒక్కసారిగా విరిగిపడ్డ ధ్వజ స్థంభం.. ఒకసారి మీరూ చూడండి
పురాతన రామాలయంలో పునరుద్దరణ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పురాతన రామాలయం ఎదుట 1963లో భారీ ధ్వజ స్థంభాన్ని ప్రతిష్టించారు. 44 అడుగుల ఎత్తుతో..
తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.. సందడి సమయంలో రాతి ధ్వజ స్థంభం విరిగిపోయింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పందిటివారి పాలెంలో పురాతన రామాలయంలో పునరుద్దరణ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పురాతన రామాలయం ఎదుట 1963లో భారీ ధ్వజ స్థంభాన్ని ప్రతిష్టించారు. 44 అడుగుల ఎత్తుతో నలభై టన్నుల బరువుండే రాతి ధ్వజ స్థంభాన్ని ఏర్పాటు చేశారు. గుత్తికొండ బిలం కొండల్లో ఏకశిలా నుంచి ఈ భారీ ధ్వజ స్తంభాన్ని తొలిచి.. ఇక్కడ ప్రతిష్టించారు. అప్పటి నుంచి ధ్వజ స్థంభం ఠీవిగా ఆలయం ఎదుట ఉంది. ఈ మధ్య కాలంలో ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే పురాతన ధ్వజ స్తంభాన్ని కొద్దిగా పక్కకి జరపాలని నిర్ణయించారు.
ధ్వజ స్థంభం భారీగా ఉండటంతో క్రేన్‌ల సాయంతో తొలగించాలనుకున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడకు చెందిన క్రేన్ ఆపరేటర్లతో ముందుగా చర్చలు జరిపారు. వారు కూడా ఇక్కడికి వచ్చి అంతా పరిశీలించారు. ధ్వజ స్థంభాన్ని పక్కకు జరిపేందుకు రెడీ అయ్యారు.
లక్షన్నర రూపాయలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎనభై టన్నుల బరువు ఎత్తే రెండు పెద్ద క్రేన్ లు తీసుకొచ్చారు. ఇంజనీర్లు సలహాతోనే ధ్వజ స్థంభాన్ని పక్కకి జరిపే ప్రయత్నం చేశారు. భూమిలో నుండి పైకి తీయడంలో సక్సెస్ అయిన క్రేన్ ఆపరేటర్లు.. మరింత కాస్తా పైకి ఎత్తుతుండా ఒక్కసారిగా ధ్వజ స్థంభంలోని కొంత భాగం విరిగిపోయింది. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి: Gold Rate Today: తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న బంగారం.. ఎప్పటి వరకు తగ్గొచ్చంటే..