వేప, రావి చెట్లకు అంగరంగ వైభవంగా వివాహం.. ఆపై విందు భోజనం.. ఎక్కడంటే..

చెట్లను ప్రేమించిన ఇద్దరు యువతులు అమెరికాలో ఆ చెట్లతోనే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఆపై ఎకో సెక్సువల్‌ గా కూడా ప్రకటించుకుని చెట్లపై తమకున్న ప్రేమను అలా విభిన్నంగా చాటుకున్నారు.

వేప, రావి చెట్లకు అంగరంగ వైభవంగా వివాహం.. ఆపై విందు భోజనం.. ఎక్కడంటే..
Basha Shek

| Edited By: Ravi Kiran

Feb 22, 2022 | 8:15 AM

చెట్లను ప్రేమించిన ఇద్దరు యువతులు అమెరికాలో ఆ చెట్లతోనే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఆపై ఎకో సెక్సువల్‌ గా కూడా ప్రకటించుకుని చెట్లపై తమకున్న ప్రేమను అలా విభిన్నంగా చాటుకున్నారు. విదేశాల్లో అలా చెట్లపై తమకున్న ప్రేమను చాటుకుని ఏకంగా పెళ్లిళ్లు చేసుకోవడం ఆశ్చర్యమనిపించవచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చెట్లకు పూజలు చేయడం మాత్రం సహజమే. ఒక చోట దంపతుల్లా ఉన్న వేప, రావి చెట్టుకు పూజలు చేస్తే పెళ్లిళ్లు అవుతాయన్న నమ్మకం చాలామందికి ఉంది. అందుకే రావి, వేప చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తారు. తమ మొక్కులు తీర్చుకుంటారు. మరికొన్ని కొన్ని చోట్ల పెళ్లిళ్లు కూడా జరిపిస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలని తిరువణ్ణామలై జిల్లాలోని ఓ ఆలయంలో రావి, వేప చెట్లకు వివాహం చేశారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో జరిగింది.

11 ఏళ్లుగా పూజలు..

తిరుపతి రూరల్ సమీపంలోని చిగురువాడకు చెందిన ముత్యాలయ్య, పద్మావతి దంపతులు గత 11 ఏళ్లుగా రావి, వేప చెట్టుకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అలాగే వేడుకగా పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. రావి, వేప చెట్ల వివాహమంటూ బంధుమిత్రలను ఇంటికి ఆహ్వానించారు. వేడుకల్లో భాగంగా రావి, వేప చెట్లకు పట్టువస్త్రాలు కంకణాలు కట్టి నూతన వధూవరుల్లా ముస్తాబు చేశారు. సాక్షాత్తు శివ పార్వతులకే పెళ్లి జరిపించామన్న ఆనందంతో వివాహా వేడుక జరిపారు. అర్చకుడి వేదమంత్రాలు, అగ్ని సాక్షిగా హోమం నిర్వహించి వేప, రావి చెట్టుకు పెళ్లి జరిపించారు. వేప రావి చెట్టు కలిసి ఉన్న చోట పందిళ్లు వేసి మంగళవాయిద్యాల మద్య మూడుముళ్లు వేయించి వేడుకగా పెళ్లి జరిపించారు. అనంతరం రుచికరమైన వంటకాలతో వివాహ విందు ఏర్పాటు చేసారు.

ఎంపీఆర్ రాజు, తిరుపతి

Also Read:Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..

Punjab Elections: స్టాక్ మార్కెట్ ఇచ్చినంత రాబడిని రాజకీయాలు ఇస్తాయా? పంజాబ్ ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కలు ఏం చెబుతున్నాయి?

Vijay Deverakonda: రష్మికతో ప్రేమ, పెళ్లి వార్తలపై తన మార్క్ ట్వీట్ వేసిన రౌడీ హీరో.. ఫుల్ క్లారిటీ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu