Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..
దాణా కుంభకోణం(Fodder scam)లో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు.
దాణా కుంభకోణం(Fodder scam)లో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా డోరాండా ట్రెజరీ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష , 60 లక్షల జరిమానా విధించింది సీబీఐ కోర్టు(Ranchi CBI Court). దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు రాంచీ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 60 లక్షల జరిమానా కూడా విధించారు. దాదాపు 25 ఏళ్ల తరువాత దాణా స్కాంలో సీబీఐ కోర్టు లాలూను దోషిగా తేల్చింది.
1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారని లాలూపై అభియోగాలు నమోదయ్యాయి. లాలూతో పాటు మరో 99 మంది 99 నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని సీబీఐ న్యాయస్థానం జనవరి 29న లూలూను దోషిగా తేల్పింది. తాజాగా సోమవారం తుది తీర్పును వెల్లడించిన న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా విధించింది.
డిఫరెంట్‌గా ఫోటోషూట్ ట్రై చేసిన దివి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్