Lalu Prasad Yadav: బీజేపీని ఎదిరించినందుకే లాలూపై తప్పుడు కేసులు.. న్యాయపోరాటం చేస్తామంటున్న తనయుడు తేజస్వి..

లాలూ బీజేపీతో దోస్తీ కడితే సత్య హరిశ్చంద్రుడని అనే వాళ్లని , కాషాయం పార్టీని ఎదిరించడం తోనే తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు.

Lalu Prasad Yadav: బీజేపీని ఎదిరించినందుకే లాలూపై తప్పుడు కేసులు.. న్యాయపోరాటం చేస్తామంటున్న తనయుడు తేజస్వి..
Lalu Prasad Yadav
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 21, 2022 | 10:27 PM

దాణా కుంభకోణం(Fodder scam) ఆర్జేడీ అధినేత లాలూను(Lalu Prasad) నీడలా వెంటాడుతోంది. డోరాండా ట్రెజరీ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష , 60 లక్షల జరిమానా విధించింది సీబీఐ కోర్టు(Ranchi CBI Court). దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు రాంచీ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో 60 లక్షల జరిమానా కూడా విధించారు. 25 ఏళ్ల తరువాత దాణా స్కాంలో సీబీఐ కోర్టు లాలూను దోషిగా తేల్చింది. 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారని అభియోగాలు నమోదయ్యాయి. . ఇది దాణా కుంభకోణంలో ఐదో కేసు మాత్రమే కాకుండా, అతిపెద్ద కేసు కూడా.

పశుగ్రాసం కుంభకోణానికి చెందిన మొత్తం ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా నిలిచారు.. అయితే ఇది తుది తీర్పు కాదని , సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో , అవసరమైతే సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని ఆర్జేడీ నేతలు తెలిపారు. లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష విధించడంపై స్పందించారు ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌. లాలూ బీజేపీతో దోస్తీ కడితే సత్య హరిశ్చంద్రుడని అనే వాళ్లని , కాషాయం పార్టీని ఎదిరించడం తోనే తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు.

దీనిపై న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. . అబే చైబాసా ట్రెజరీ నుండి 37.7 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నందుకు సంబంధించిన మొదటి కేసులో లాలూ ప్రసాద్‌కు 5 సంవత్సరాల శిక్ష పడింది. దేవఘర్ ట్రెజరీ నుంచి నిధుల ఉపసంహరణ కేసులో మూడున్నరేళ్లు శిక్ష, చైబాసా ట్రెజరీ నుండి 33.13 కోట్లు అక్రమంగా ఉపసంహరించుకున్న మూడవ కేసులో 5 సంవత్సరాల శిక్ష పడింది. దుమ్కా ట్రెజరీ నుంచి 3.76 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై నాలుగో కేసులో రెండు వేర్వేరు సెక్షన్లలో 7 – 7 ఏళ్ల జైలు శిక్ష పడింది.

ఇవి కూడా చదవండి: Gold Rate Today: తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న బంగారం.. ఎప్పటి వరకు తగ్గొచ్చంటే..

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు