AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: తుకుడే గ్యాంగ్‌ని ఎందుకు ముంబై తీసుకెళ్లారో చెప్పాలి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ ప్రశ్నలు..

ముఖ్యమంత్రి కేసీఆర్ పై(CM KCR) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay) నిప్పులు చెరిగారు. తుకుడే గ్యాంగ్‌ని కేసీఆర్ ముంబై(Mumbai) తీసుకెళ్లడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు.

Bandi Sanjay: తుకుడే గ్యాంగ్‌ని ఎందుకు ముంబై తీసుకెళ్లారో చెప్పాలి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ ప్రశ్నలు..
Sanjay Kasula
|

Updated on: Feb 21, 2022 | 9:15 PM

Share

ముఖ్యమంత్రి కేసీఆర్ పై(CM KCR) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay) నిప్పులు చెరిగారు. తుకుడే గ్యాంగ్‌ని కేసీఆర్ ముంబై(Mumbai) తీసుకెళ్లడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. దేశం నుంచి బయటకు పంపాలి అనే వ్యక్తిని పట్టుకోని ముంబై వెళ్లడంలో ఆంతర్యం ఏంటో చెప్పాలని అన్నారు. దేశ భద్రతను ప్రశ్నించిన వ్యక్తిని కేసీఆర్ వెంటేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. గతంలో ప్రాంతీయ పార్టీలే ముఖ్యం అన్న సీఎం కేసీఆర్‌..  ఇవ్వాళ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటూ మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవ చేశారు. అవినీతి రహిత ప్రభుత్వం మోడీ నాయకత్వంలో నడుస్తుందని శ్రీశ్రీశ్రీ చిన జీయర్ తెలిపిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. మేడారం అభివృద్ధి జరగలేదు కాబట్టే మొఖం చూపించలేఖ వెళ్ళలేదన్నారు. గవర్నర్ మేడారం పర్యటన రోజున నేరుగా సీఎంవో కార్యాలయం నుంచి డైరెక్షన్స్ వచ్చాయని ఆరోపించారు.

సీఎం హోదాలో అక్కడికి వెళ్లాల్సిందిపోయి.. అక్కడ మంత్రులు, అధికారులు ఎవరూ వుండొద్దంటూ ఆదేశాలు వెళ్లాయంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళదామన్న కేసీఆర్ పిలుపుకి స్పందన కరువైందన్నారు. అభివృద్ధి జరగలేదు కాబట్టే మేడారం జాతరకు కేసీఆర్ ముఖం చాటేశారని చెప్పారు.

గవర్నర్ రాజకీయ నాయకురాలు కాదని.. తొలుత గవర్నర్ చాలా మంచిదని చెప్పిన ముఖ్యమంత్రికి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. గవర్నర్ ప్రథమ పౌరురాలని.. ఒక మహిళ అని, అమ్మవారి దర్శనానికి వచ్చారని బండి సంజయ్ తెలిపారు. ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయినా పూర్తికాలం వుండరని.. కొడుక్కి అప్పగించేస్తారని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి: Gold Rate Today: తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న బంగారం.. ఎప్పటి వరకు తగ్గొచ్చంటే..

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు