AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: సౌత్‌ టు నార్త్‌ జర్నీ రోడ్‌మ్యాప్‌ రెడీ అయిందా? కేసీఆర్‌తో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలేంటి?

BJP ముక్త భారత్‌ నినాదంతో రాజకీయం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి KCR తాజాగా దేశానికి తెలంగాణ తరహా డెవలప్‌మెంట్‌ మోడల్‌ అవసరమంటున్నారు.

Big News Big Debate: సౌత్‌ టు నార్త్‌ జర్నీ రోడ్‌మ్యాప్‌ రెడీ అయిందా? కేసీఆర్‌తో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలేంటి?
Big News Big Debate
Ram Naramaneni
|

Updated on: Feb 21, 2022 | 10:18 PM

Share

సౌత్‌ టు నార్త్‌ జర్నీ రోడ్‌మ్యాప్‌ రెడీ అయిందా? కేసీఆర్‌తో కలిసొచ్చే ప్రాంతీయపార్టీలేంటి? కాంగ్రెస్‌ లేని ప్రత్యామ్నాయం సాధ్యమేనా? జాతీయ స్థాయిలో మోదీని ఢీకోట్టే నాయకుడెవరు?

BJP ముక్త భారత్‌ నినాదంతో రాజకీయం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి KCR తాజాగా దేశానికి తెలంగాణ తరహా డెవలప్‌మెంట్‌ మోడల్‌ అవసరమంటున్నారు. బీజేపీయేతర ఫ్రంట్‌తో కలిసిరావాలని శివసేనకు పిలుపునివ్వగా… కాంగ్రెస్‌ లేని టెంట్‌ నిలబడుతుందా అంటూ MP సంజయ్‌ రౌత్‌ ప్రశ్నిస్తున్నారు. ప్రాంతీయ శక్తులన్నీ ఏకమై దేశాన్ని బాగు చేసుకుందామని కేసీఆర్ అంటే… తుకుడే గ్యాంగుతో కలిసి దేశ ఐక్యతకే ప్రమాదంగా మారుతున్నారని రివర్స్‌ పంచ్‌ వేసింది బీజేపీ.

దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ CM కేసీఆర్‌ దూకుడు పెంచారు. బంగారు తెలంగాణ తరహాలోనే బంగారు భారతదేశం సాకారం చేసుకుందామంటున్నారు. ఇండియానే అమెరికాగా మార్చే వనరులున్నాయని.. అయినా గత 75 ఏళ్లుగా పాలకుల చేతకానితనం వల్ల దేశం వెనకబడిపోయిందన్న కేసీఆర్‌.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. శరద్‌పవార్‌, శివసేన థాక్రే కూడా భరోసా ఇచ్చారంటోంది TRS.

జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించడం అటుంచితే తుక్‌డే గ్యాంగుతో కలిసి కేసీఆర్‌ భారతదేశ ఐక్యతకు ప్రమాదంగా మారుతున్నారని సంచలన ఆరోపణలు చేసింది బీజేపీ. ఆయన రాజకీయ ఉనికి దేశానికి ముప్పేనని.. యాంటీ నేషనల్‌గా ఉన్న ప్రకాష్‌రాజ్‌ వంటి వారితో కేసీఆర్‌ ప్రయాణం అనుమానాలకు తావిస్తుందన్నారు బీజేపీ నేత మురళీధర్‌రావు.

తెలంగానలో BJP-TRS మధ్య మాటలయుద్ధం ఎలా ఉన్నా దేశంలోని ప్రాంతీయశక్తులను నడిపించగలిగే శక్తి KCR‌కు ఉందని శివసేన అంటోంది. అయితే బీజేపీని తట్టుకోవాలంటే కాంగ్రెస్‌ లేకుండా సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు శివసేన. గతంలో మమత ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్‌తో కలిస్తేనే ఫ్రంట్‌ సాధ్యమవుతుందన్న తమ వాదన బలంగా వినిపించినట్టు క్లారిటీ ఇచ్చారు సంజయ్‌రౌత్‌. భాగ్యనగరం నుంచే బీజేపీపై యుద్ధం ప్రకటించారు కేసీఆర్‌. మహారాష్ట్ర మీదుగా నార్త్‌ జర్నీకి రోడ్‌ మ్యాప్‌ ఖరారు చేస్తున్నారు.

ఇక ఇదే అంశంపై టీవీ9 వేదికగా డిబేట్ నిర్వహించారు సంస్థ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్. ఆ వీడియోను దిగువన చూడండి…