AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: రష్మికతో ప్రేమ, పెళ్లి వార్తలపై తన మార్క్ ట్వీట్ వేసిన రౌడీ హీరో.. ఫుల్ క్లారిటీ

ప్రస్తుతం పూరి డైరెక్షన్‌లో 'లైగర్'తో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ 'జనగణమన', సుకుమార్​తో ఓ సినిమా, శివ నిర్వాణతో ఓ మూవీ చేయనున్నాడు.

Vijay Deverakonda: రష్మికతో ప్రేమ, పెళ్లి వార్తలపై తన మార్క్ ట్వీట్ వేసిన రౌడీ హీరో.. ఫుల్ క్లారిటీ
Vijay Rashmika
Ram Naramaneni
|

Updated on: Feb 21, 2022 | 10:07 PM

Share

Tollywood:  విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఇప్పుడు మంచి స్పీడ్‌లో ఉన్న హీరో. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి(Arjun Reddy), గీత గోవిందం(Geetha Govindam) వంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. మంచి గ్రేస్‌లో ఉన్నాడు కాబట్టి గాసిప్స్‌ అతడిని వెంటాడుతున్నాయి. ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్‌, రష్మిక మందన్నా పెయిర్‌కి మంచి అప్లాజ్ లభించింది. ఆ తర్వాత వీరు ‘డియర్ కామ్రేడ్'(Dear Comrade) మూవీలో కలిసి నటించారు. ఇరువురి కెమెస్ట్రీ స్క్రీన్‌పై బాగా వర్కువుట్ అవ్వడంతో రీయల్ లైఫ్‌లోనూ వారిద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ చాలాసార్లు బయట కూడా కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ నెటిజన్లు తెగ మాట్లాడేసుకుంటున్నారు. విజయ్‌కు నేషనల్ లెవల్‌లో మంచి క్రేజ్ ఉండటంతో.. అక్కడి వెబ్‌సెట్లు కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ వచ్చాయి. ఇక మన లోకల్ వెబ్‌సైట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు ఈ రూమర్స్ ఇంకాస్త ముందుకు వెళ్లాయి. ఇటీవల రష్మిక ప్రేమ, పెళ్లి గురించి కూడా మాట్లాడింది. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని.. ఈ ఏడాది చివర్లో వీరు పెళ్లి పీటలెక్కనుందంటూ తెగ వార్తలు వచ్చాయి.  వీటిపై తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందంటూ తన మార్క్ ట్వీట్ వేశాడు. విజయ్ స్పందనతో వీరి లవ్ మేటర్‌పై పూర్తి క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం పూరి డైరెక్షన్‌లో ‘లైగర్’తో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ‘జనగణమన’, సుకుమార్​తో ఓ సినిమా, శివ నిర్వాణతో ఓ మూవీ చేయనున్నాడు. ‘పుష్ప’తో బ్లాక్ బాస్టర్​ హిట్​ అందుకున్న రష్మిక కూడా ‘పుష్ప 2’ షూటింగ్​కు రెడీ అవుతుంది. ఆమె హీరోయిన్​గా చేసిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. మార్చి 4న థియేటర్లలోకి రానుంది. హిందీలోనూ పలు సినిమాలు చేస్తోంది రష్మిక.

Also Read: Hyderabad: అమెరికా నుంచి పార్శిల్​లో పరుపు.. ఓపెన్​ చేస్తే అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి

తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు