AP Weather: ఏపీలో వర్షాలు ఆగినట్లేనా..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలో మొన్నీమధ్య వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలు వరదలకు అల్లకల్లోలం అయ్యాయి. మరి వర్షాలు తగ్గినట్లేనా..? ఇదిగో వెదర్ రిపోర్ట్...
ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ / వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
—————————
సోమవారం, మంగళవారం, బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
—————–
సోమవారం, మంగళవారం, బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
రాయలసీమ :-
———–
సోమవారం, మంగళవారం, బుధవారం:- పొడి వతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.