Hidden treasures: గోకవరంలో గుప్త నిధుల కలకలం.. పూజారులకు బెదిరింపులు.. ఆలయ పరిసరాల్లో తవ్వకాలు..
Hidden treasures: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని సింగరమ్మ చింత ఆలయ పరిసరాల్లో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.
Hidden treasures: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని సింగరమ్మ చింత ఆలయ పరిసరాల్లో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయ సమీపంలో సుమారు ఆరు అడుగుల గుంతను తవ్వారు దుండగులు. అంతేకాదు.. అడ్డుకోబోయిన తనను బెదిరించారంటూ సింగరమ్మ చింత ఆలయ మహిళా అర్చకురాలు ఆరోపించారు. తవ్వకాల విషయం తెలుసుకున్న అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకున్న దుండగులు తవ్విన గుంతను పరిశీలించారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా, తవ్వకాల గురించి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు తుమ్మల పద్మజా ప్రకాష్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also read:
International flights ban: అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువు పొడిగింపు.. ఎప్పటివరకు అంటే..
TRS vs BJP: బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. అదంతా నిజం కాదంటూ పుకార్లకు చెక్..