International flights ban: అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువు పొడిగింపు.. ఎప్పటివరకు అంటే..
కేంద్ర ప్రభుత్వం మరోసారి అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధృవీకరించింది.

కేంద్ర ప్రభుత్వం మరోసారి అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధృవీకరించింది. కోవిడ్-19 వ్యాప్తి, కొత్త స్ట్రెయిన్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. డీజీసీఏ స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన విమాన సర్వీసులు, కార్గో విమానాలకు మాత్రం ఈ షరతులు వర్తించవని వెల్లడించింది. ఈ విషయంలో సవరించిన ఉత్తర్వులకు సంబంధించి డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్ కుమార్ గురువారం సాయంత్రం సర్క్యులర్ విడుదల చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను 2020 మార్చి 23 నుంచి డీజీసీఏ నిలిపేసిన విషయం తెలిసిందే. కాగా, వందే భారత్ మిషన్‌లో భాగంగా మే నుంచి ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తున్నారు. అమెరికా, యుకె, యుఏఇ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్‌తో సహా 24 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందాలను చేసుకుని సర్వీసులను కొనసాగిస్తోంది.
Also Read:
అంతరిక్షంలోకి ప్రయాణించాలనుకుంటున్నారా… టికెట్ కొనడానికి రూ.400కోట్లు సిద్ధం చేసుకోండి..?