Telangana: పెద్ద చెరవులో వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..
చెరువుల్లో నీరు అడుగంటుతుండటంతో చేపలు పట్టేందుకు జనం ఎగబడుతున్నారు. పల్లెల్లో కనిపిస్తున్న దృశ్యాలు చెరువుల జాతర తలపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. కుర్నవల్లి పెద్ద చెరువులో జల పుష్పాల జాతరలో భాగంగా చేపల వేటకు జనం ఎగబడ్డారు.

చెరువుల్లో నీరు అడుగంటుతుండటంతో చేపలు పట్టేందుకు జనం ఎగబడుతున్నారు. పల్లెల్లో కనిపిస్తున్న దృశ్యాలు చెరువుల జాతర తలపిస్తోంది. ఈ క్రమంలోనే కుర్నవల్లి పెద్ద చెరువులో జల పుష్పాల జాతరలో భాగంగా చేపల వేటకు జనం ఎగబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించేవారు. ఆ క్రమంలోనే పంటలు పండించేందుకు చెరువులు నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ఈ చెరువులని ఆధారంగా చేసుకుని సాగు చేస్తున్నారు ఇక్కడ ప్రజలు.
కరకగూడెం మండలంలో గొలుసు కట్టుగా ఉండే చెరువుల ద్వారా వేలాది ఎకరాలను సాగు చేస్తున్నారు రైతులు. కరకగూడెం మండల వ్యాప్తంగా 113 చెరువులు ఉన్నాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ చెరువులు జన జాతరతో నిండిపోతాయి. రెండు పంటలు పండించిన అనంతరం చెరువుల్లో నీటి శాతం పూర్తిగా తగ్గిపోవడంతో చేపలు పట్టేందుకు జనం భారీగా తరలి వస్తుంటారు. చెరువుల్లో చేపలు పట్టే ముందు చుట్టుపక్కల గ్రామాలకు విషయం తెలియజేసి అందరు ఒకేసారి చెరువుల్లో చేపలు పట్టడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలోనే కర్ణవల్లిలోని పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు జనం భారీగా తరలివచ్చారు. సుమారు ఐదు ఊర్ల జనం ఒక్కసారిగా చెరువులో దిగడంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. జల పుష్పాల కోసం జనం పోటీలు పడ్డారు. కొందరికి అదృష్టం కలిసి వచ్చి ఎక్కువ చేపలు దొరకగా మరికొందరికి అరకిలో కూడా దొరకని పరిస్థితి కనిపించింది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా జనం చేపలు పట్టేందుకు ఎగబడడం చేపల జాతరను తలపించింది.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..