Perni Nani: పవన్ కళ్యాణ్‌కి కాపు ఓట్లు కావాలి.. సంక్షేమం అక్కర్లేదు: పేర్ని నాని
టీడీపీ పదికాలాల పాటు బాగుండాలని పవన్ పార్టీ స్థాపించారని.. పవన్ పర్యటన పేరు రైతులది.. చేస్తుంది చంద్రబాబుకు అనుకూల రాజకీయం అంటూ పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. ఆరు నెలలకోసారి జగన్ ను తిట్టడానికి పవన్ రోడ్డు మీదకు వస్తున్నాడన్నారు.

ఎన్నికల వార్ ను తలపిస్తూ ఏపీలో పాలిటిక్స్ వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతి పక్ష నేతలు మాటల యుద్ధాన్ని చేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు అనుకూల రాజకీయం చేస్తున్నారని.. జగన్ ను తిట్టేందుకే పవన్ రోడ్లమీదకు వస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ పదికాలాల పాటు బాగుండాలని పవన్ పార్టీ స్థాపించారని.. పవన్ పర్యటన పేరు రైతులది.. చేస్తుంది చంద్రబాబుకు అనుకూల రాజకీయం అంటూ పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. ఆరు నెలలకోసారి జగన్ ను తిట్టడానికి పవన్ రోడ్డు మీదకు వస్తున్నాడన్నారు.
కాపుల ఓట్లు అడిగే పవన్.. ఏనాడైనా కాపు సంక్షేమం కోసం పొరాడారా? అని ప్రశ్నించారు. ప్రజల్లో పవన్ నమ్మకం కలిగించాడా.. పదేళ్ళలో పట్టుమని వరుసగా పది రోజులు పవన్ ప్రజల్లో ఉన్నాడా.. ప్రజల మాటలు ఎప్పుడైనా పవన్ విన్నారా అంటూ పవన్ కు పేర్ని నాని ప్రశ్నలను సంధించారు. కాపులను బీసీల్లో చేర్చుతామన్న చంద్రబాబు హామీ ఏమైందని.. ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లు నా చేతుల్లో లేదని జగన్ ఎన్నికలకు ముందే నిజం చెప్పారు. చంద్రబాబు కోసమే పవన్ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు పేర్ని నాని. రాజకీయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్..సీఎం ను టీడీపీ పట్టాభి అనకూడని మాట అంటే మానవతావాదిగా ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..