Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
దొంగతనాలు రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. మెడలో చైను లాక్కెళ్ళేది ఒకరైకే.. మాటు వేసి దొంగతనాలు చేసేది మరొకరు.. అయితే ఇక్కడ కొందరు గ్రూపుగా దొంగతనాలు చేస్తూ మహిళలు.. మహిళలనే టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు ... బస్సులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులా బిల్డప్పులు ఇస్తూ మత్తుమందు వారికి వాసన చూపించి మెడలోని బంగారం అంతా దోచేస్తున్నారు.. ఇలాంటి సంఘటన ఒకటి అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది.

అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో సినీ ఫక్కిలో మోసం జరిగింది. బస్సులో ఓ మహిళను ఏమార్చి ఆమె వద్ద ఉన్న నగలను దోచుకున్న ఉదంతం రాజంపేటలో జరిగింది.. నందలూరు మండలం నూకినేనిపల్లి సమీపంలోని బలిజపల్లికి చెందిన సరస్వతి అనే మహిళ నందలూరు బస్టాండ్ లో తిరుపతి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్టాండ్ లో ఆమె ఉన్నప్పుడు నుంచి నలుగురు మహిళలు ఆమెను అనుసరిస్తున్నారు. ఆమె బస్టాండ్ సమీపంలోని స్వీట్ స్టాల్ లో స్వీట్లు కొనుక్కున్నప్పుడు పర్సుతీయడం వారు గమనించారు. సరస్వతితో పాటే వారు కూడా తిరుపతి వెళ్లే బస్సు ఎక్కారు. సరస్వతి తిరుపతికి టికెట్ తీసుకోగా మిగిలిన వారు కోడూరుకు టికెట్ తీసుకున్నారు. కండక్టర్ టికెట్ ఇచ్చే సమయంలో నలుగురిలోని ఓ మహిళ… బాధితురాలు సరస్వతి మీద పడుతూ టికెట్ డబ్బులు నేనిస్తానంటూ తనతో వచ్చిన మహిళ నుంచి పర్సు లాక్కొన్నట్లు నటిస్తూ.. బాధితురాలి వద్ద నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించింది. ఈ క్రమంలో సరస్వతికి కాస్త మత్తుగా ఉండడంతో దొంగలు సరస్వతికి మత్తుమందు ఇచ్చారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వెంటనే నలుగురు మహిళలు ఆకేపాడు క్రాస్ రోడ్ సమీపంలో బస్సును ఆపి దిగి వెళ్లిపోయారు. బాధితురాలు సరస్వతి తేరుకొని మన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలు జాగ్రత్తగా ఉండండి.. బస్సు ఎక్కే సమయంలో తోటి ప్రయాణికులు ఎవరు అనేది గమనించి వారితో ప్రయాణం చేయండి… ఎవరు ఏమిచ్చినా తినకూడదు.. ఎవరు మాట్లాడిన వారితో పద్ధతిగా మాట్లాడి ఊరుకుండడమే మంచిది… లేదంటే మీ పర్సు, నగలు గుల్ల అవ్వడం పక్కా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..