Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI: పెరిగిన మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు.. మొదటి స్థానంలో ఏది? ట్రాయ్‌ రిపోర్ట్‌!

TRAI: డిసెంబర్ 2024లో దేశంలో మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరుకుంది. దీనిలో జియో మొబైల్, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, వోడాఫోన్‌ ఐడియాల ఏయే స్థానాల్లో ఉన్నాయో టెలికాం నియంత్రణ సంస్థ TRAI మంగళవారం వెల్లడించింది. గత సంవత్సరం చివరి నెలలో జియో నెట్‌వర్క్‌లో భారీగా చేరారు..

TRAI: పెరిగిన మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు.. మొదటి స్థానంలో ఏది? ట్రాయ్‌ రిపోర్ట్‌!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 12, 2025 | 10:50 PM

గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. డిసెంబర్‌ నెల చివరినాటికి స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజం జియోకు ఈసారి భారీ ఊరట లభించింది. గత సంవత్సరం నవంబర్‌ నెల చివరినాటికి 118.77 కోట్లుగా ఉండగా, వీరిలో పట్టణప్రాంతాల్లో ఉన్న మొబైల్‌ సబ్‌స్ర్కైబర్లు 65.98 కోట్లు ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 52.72 కోట్లు ఉన్నారు.

అలాగే వైర్‌లెస్‌ సబ్‌స్ర్కైబర్లు 114.86 కోట్ల నుంచి 115.06 కోట్లకు పెరిగినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. గత సంవత్సరం చివరి నెలలో జియో నెట్‌వర్క్‌లోకి 39.06 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌లోకి 10.33 లక్షల మంది జతయ్యారు. కానీ వొడాఫోన్‌ ఐడియా 17.15 లక్షల మంది వైర్‌లెస్‌ సబ్‌స్ర్కైబర్లను కోల్పోయింది. అలాగే ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 3.16 లక్షల మంది, ఎంటీఎన్‌ఎల్‌ 8.9 లక్షల మందిని కోల్పోయాయి.

లయన్స్ జియో ఇన్ఫోకామ్ 47.65 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ 28.93 కోట్ల మంది, వొడాఫోన్ ఐడియా 12.63 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Jio vs Starlink: ముఖేష్ అంబానీ జియో.. ఎలోన్ మస్క్ స్టార్ లింక్.. వీటిలో ఏది చౌకైనది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
ఇన్ని రికార్డులా..! సునీతమ్మా.. నీకు వందనం!
ఇన్ని రికార్డులా..! సునీతమ్మా.. నీకు వందనం!
IPL Records: ఐపీఎల్ చరిత్రలో 10 భారీ రికార్డులు ఇవే
IPL Records: ఐపీఎల్ చరిత్రలో 10 భారీ రికార్డులు ఇవే