AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2023: రేపట్నుంచే ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌-2023 ప్రారంభం.. పరీక్ష రోజున ఈ పొరపాట్లు చేయకండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సోమవారం (మే 15) నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్ష రోజున ఈ కింది నిబంధనలు ఖచ్చితంగా పాలించాలని..

AP EAPCET 2023: రేపట్నుంచే ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌-2023 ప్రారంభం.. పరీక్ష రోజున ఈ పొరపాట్లు చేయకండి
AP EAMCET 2023
Srilakshmi C
|

Updated on: May 14, 2023 | 12:47 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సోమవారం (మే 15) నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు మే 15 నుంచి 19 వరకు జరుగనున్నాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్ష నిర్వహిస్తామని ఏపీ ఈఏపీసెట్‌ ఛైర్మన్, అనంతపురం జేఎన్‌టీయూ ఉపకులపతి ఆచార్య రంగజనార్దన పేర్కొన్నారు. ఈ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 7.30 నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ఆరంభమయ్యే పరీక్షకు 1.30 నుంచే అనుమతిస్తామన్నారు. రూ.10 వేల అపరాధ రుసుంతో ఆదివారం కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు హాల్‌టికెట్‌తోపాటు ఫొటో ఐడెంటిటీ కోసం ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. చేతులకు గోరింటాకు పెట్టుకున్న విద్యార్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రోజే కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలన్నారు. హాల్‌ టికెట్‌లో పొరపాట్లు ఉంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా సహాయకేంద్రానికి లేదా మెయిల్‌ పంపి సరిచేయించుకోవచ్చని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 129, తెలంగాణలో 7 కేంద్రాల్లో.. 3 లక్షల 40 వేల మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?