AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: అరేబియన్ భామల సౌందర్య రహస్యాలు మీకోసం..! ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి..!

మృదువైన చర్మం, ఒత్తైన అందమైన జుట్టు, ఆకర్షణీయమైన కళ్లతో అరేబియన్ మహిళలు ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటారు. వారు ఈ అందాన్ని కాపాడుకోవడానికి సహజసిద్ధమైన పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి ఈ సహజమైన రహస్యాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పదండి.

Prashanthi V
|

Updated on: Mar 12, 2025 | 10:16 PM

Share
కలబంద గుజ్జులో పసుపు, ఆర్గన్ ఆయిల్ కలిపి చర్మానికి ప్యాక్ లా వేసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం నవయవ్వనంగా మెరిసిపోతుంది. వయసు పెరిగినా వన్నె తరగని అరబిక్ భామల చర్మ సౌందర్య రహస్యం ఇదేనట.

1 / 6
సలాడ్లలో, సాస్ డిప్ అవకాడోను వాడటం మనకు అలవాటే. అయితే అరేబియన్లు సౌందర్య పరిరక్షణలోనూ దీనిని భాగం చేస్తారట. అవకాడో గుజ్జులో తేనె, నిమ్మరసం, కాస్త కొబ్బరినూనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అవకాడో నూనెతో మసాజ్ చేసుకున్నా ఫలితం ఉంటుంది.

2 / 6
చర్మం పొడిబారకుండా ఉండటానికి తేనె ఉపయోగపడుతుంది. తేనె చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది. అరేబియన్ భామలు కీరదోస రసంలో తేనెను కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటారట. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు.

3 / 6
టర్కీ భామల్లాగే అరేబియన్లూ తమ సౌందర్య పోషణకు కెఫిర్ అనే బ్యాక్టీరియాతో తయారు చేసిన పెరుగును ఉపయోగిస్తారు. ఈ క్రమంలో టర్కీ భామలు దీన్ని ఆహారంగా తీసుకుంటే.. అరేబియన్లు ఆహారంతో పాటు జుట్టుకి, చర్మానికి ప్యాక్గానూ దీన్ని వాడతారు. కెఫిర్కి ప్రత్యామ్నాయంగా మనకు అందుబాటులో ఉన్న పెరుగును పులియబెట్టి వాడుకోవచ్చు.

4 / 6
గుడ్డులోని తెల్ల సొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. అలాగే గుడ్డుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అరేబియన్ మహిళలు తమ ఒత్తైన కురుల కోసం గుడ్డుతో పాటు కొబ్బరి నూనె, నువ్వుల నూనె కలిపి జుట్టుకి ప్యాక్‌లా వేసుకుంటారు. దీనివల్ల కుదుళ్లు దృఢమవడంతో పాటు వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.

5 / 6
అరేబియన్ల సౌందర్య పోషణలో ఆర్గన్ ఆయిల్‌ది చాలా ముఖ్యమైన స్థానం. తల వెంట్రుకల నుంచీ కాలిగోళ్ల వరకూ ప్రతి సౌందర్య చికిత్సలో భాగంగా వారు దీన్ని వాడటానికి ఇష్టపడతారు. జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి తరచూ ఆర్గన్ ఆయిల్‌తో మర్దన చేసుకుంటారు అరేబియన్ భామలు. కనుబొమ్మలు, రెప్పలకు ఉండే వెంట్రుకలు ఒత్తుగా పెరగటానికి కూడా వారు ఈ నూనెను వాడతారట.

6 / 6