Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB29 లీక్స్.. రాజమౌళి సంచలన నిర్ణయం..

ఒక్కోసారి అతిజాగ్రత్త కూడా మంచిది కాదేమో..? తాజాగా మహేష్ బాబు, రాజమౌళి సినిమా విషయంలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. కనీసం ఒక్క ఫోటో కూడా విడుదల చేయకుండానే షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు జక్కన్న. అదే లీకులకు ప్రధాన కారణంగా మారుతుందా..? ఈగను కూడా అనుమతి లేనిదే రానివ్వని రాజమౌళి సినిమా నుంచి ఇన్ని లీక్స్ ఎలా అవుతున్నాయి..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Mar 12, 2025 | 10:02 PM

మామూలుగానే రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎక్కడ ఎక్కువ జాగ్రత్త ఉంటుందో అక్కడే లీకులకి ఎక్కువ ఆస్కారం ఉంటుందేమో మరి..? SSMB29 విషయంలోనూ ఇదే జరుగుతుంది.

1 / 5
తాజాగా షూటింగ్ వీడియోనే బయటికి రావడంతో షాక్ అవుతున్నారు మేకర్స్. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏంటో ఇది అని తల పట్టుకుంటున్నారు.SSMB29 చిత్ర షెడ్యూల్ ప్రస్తుతం ఒరిస్సాలో జరుగుతుంది.

2 / 5
అక్కడి అటవీ ప్రాంతంలో 25 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసారు జక్కన్న. మహేష్ బాబు సహా కొందరు ఆర్టిస్టులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సెట్ నుంచి దాదాపు 13 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. SSMB29 లీక్స్‌లో ఇది రెండోది. ఈ మధ్యే హైదరాబాద్‌లో వేస్తున్న సెట్ ఫోటోలు కూడా ఇలాగే లీక్ అయ్యాయి.

3 / 5
SSMB29 తర్వాతి షెడ్యూల్ కోసం కాశీ సెట్ వేస్తున్నారు మేకర్స్. అత్యంత భారీగా ఈ సెట్ నిర్మాణం జరుగుతుంది. అక్కడే మేజర్ పార్ట్ షూట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక ధీరుడు. దీని ఫోటోలు లీక్ అవ్వడం కూడా చర్చనీయాంశం అయింది.

4 / 5
సాధారణంగా ప్రతీ సినిమాకు ముందు కనీసం ఒక్క ఫోటో అయినా విడుదల చేసేవారు రాజమౌళి.. కానీ ఈ SSMB29 విషయంలో మరీ కఠినంగా ఉన్నారు జక్కన్న. కనీసం ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. అందుకే ఏది లీక్ అయినా వెంటనే వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. లీకులపై చాలా సీరియస్‌గా ఉన్నారు టీం. మరి దీనికెక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

5 / 5
Follow us