హృతిక్ రోషన్‌కు ప్రమాదం.. షాక్‌లో వార్2 టీం
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ టీం కు బిగ్ ఝలక్ తగిలింది. ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ వేయాల్సి వచ్చింది. కారణం ఈ మూవీలో వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్న హృతిక్ గాయపడడమే!
ఎస్ ! వార్ 2 మూవీ షూటింగ్ లో హీరో హృతిక్ రోషన్ గాయపడ్డాడని వార్తలు వినిపిస్తున్నాయి. సాంగ్ రిహార్సిల్స్ లో హృతిక్ గాయపడ్డట్టు బాలీవుడ్ ల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వార్ 2 సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో హృతిక్, తారక్ మధ్య ఓ అదిరిపోయే సాంగ్ ఉంటుందని టాక్. ఈ సాంగ్ రిహార్సిల్స్ లో భాగంగనే హృతిక్ గాయపడ్డాడని బీటౌన్‌లో న్యూస్. ప్రస్తుతం హృతిక్ కు చికిత్స చేస్తున్నారట వైద్యులు . . దాంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. ఈ ఎఫెక్ట్ ఈ మూవీ రిలీజ్ పై కూడా పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అంతేకాదు హృతిక్ ను వైద్యులు నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు కూడా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chhaava: OTTలోకి ఛావా.. డేట్ ఫిక్స్ ??
గాల్లో విమానం.. తనను దించేయాలని మహిళ కేకలు! దుస్తులు విప్పి పరుగులు
ఛార్జింగ్ కోసం ఇంత రిస్క్ అవసరమా? నెట్టింట వైరల్ అవుతున్న
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

