Ambati rayudu: గుంటూరులో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అంబటి రాయుడు పర్యటనలు..

ఇటీవలే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. దానిలో భాగంగా.. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలంలో సందడి చేశారు. ముందుగా.. కొలకలూరులోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు.

Ambati rayudu: గుంటూరులో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అంబటి రాయుడు పర్యటనలు..
Ambati Rayudu
Follow us
Aravind B

|

Updated on: Jul 01, 2023 | 5:20 AM

ఇటీవలే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. దానిలో భాగంగా.. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలంలో సందడి చేశారు. ముందుగా.. కొలకలూరులోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు. అనంతరం ఖాజీపేట గ్రామంలోని రైతు బరోసా కేంద్రంలో రైతులతో ముచ్చటించారు. అనంతరం శాలివాహన సంఘ సభ్యులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక.. మధ్యాహ్నం భోజనం తర్వాత జిల్లా పరిషత్ హైస్కూల్‌కు వెళ్లి అక్కడి వసతులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా.. గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు అంబటి రాయుడు.

ప్రభుత్వ పరంగా మంచి సపోర్ట్ అందుతుందని రైతులు చెప్తున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించానని.. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. ప్రభుత్వ స్కూల్స్ కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని.. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఇక.. సీఎం జగన్‌తో భేటీపైనా స్పందించారు. సీఎం జగన్‌ను స్పోర్ట్స్ గురించి మాత్రమే కలిశా తప్ప.. రాజకీయాలు లేవన్నారు. స్పోర్ట్స్‌ అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ చెప్పినట్లు వెల్లడించారు. అలాగే.. ప్రజలకు సేవ చేయాలని తమ తాత దగ్గర నుంచి నేర్చుకున్నానన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!