ఆవుపై దాడి చేస్తున్న సింహం.. అదును చూసి బెదిరించిన రైతు.. వీడియో చూస్తే అవాక్కే..!
ఓ సింహం ఆవును పట్టుకుని నేలపై వేలాడుతోంది. అది ఎంత ప్రయత్నించినా ఆవు దానికి చిక్కలేదు. అంతలోనే ఆవు యజమాని వచ్చాడు. ఆవును కాపాడేందుకు సింహాన్ని బెదిరిస్తున్నాడు. సింహాన్ని కొట్టేందుకు ఆ రైతు దగ్గర్లో ఏదైనా దొరుకుతుందని వెతకడం కూడా కనిపించింది. అతనికి ఏమీ దొరకలేదు. కానీ, ఒక రాయి దొరికింది.
సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలను చూస్తుంటాం. అందులో చాలా సార్లు సింహాలు, పులుల వేటకు సంబంధించిన వీడియోలు కూడా చూస్తాం. అయితే, కొన్నివీడియోల్లో సింహాలు, పులులు మనుషులు, కుక్కలకు భయపడి పోవటం కూడా చూస్తుంటాం. అలాంటిదే మరోక వీడియో ఇక్కడ వైరల్ అవుతోంది. ఓ రైతు తన ఆవును కాపాడుకోవడానికి సింహానికి కూడా భయపడలేదు. అతడు దాన్ని బెదిరించి అక్కడ్నుంచి పారిపోయేలా చేశాడు. వీడియో గుజరాత్‌కు చెందినదిగా తెలిసింది. గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేశోద్‌కు చెందిన కార్పొరేటర్ వివేక్ కొట్డియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటన గిర్ సోమనాథ్ జిల్లాకు చెందినదని ఆయన పేర్కొన్నారు. సింహం ఆవుపై పడి దాడి చేస్తోంది. అంతలోనే అటుగా వచ్చిన రైతు తన ఆవు వద్దకు వెళ్లి సింహాని తరిమికొట్టాడు. ఈ ఘటనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కెమెరాలో బంధించగా, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో కారులో కూర్చుని షూట్ చేసినట్టుగా అర్థమవుతోంది. 40 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో.. మార్గమధ్యంలో ఓ సింహం ఆవును పట్టుకుని నేలపై వేలాడుతోంది. అది ఎంత ప్రయత్నించినా ఆవు దానికి చిక్కలేదు. అంతలోనే ఆవు యజమాని వచ్చాడు. ఆవును కాపాడేందుకు సింహాన్ని బెదిరిస్తున్నాడు. సింహాన్ని కొట్టేందుకు ఆ రైతు దగ్గర్లో ఏదైనా దొరుకుతుందని వెతకడం కూడా కనిపించింది. అతనికి ఏమీ దొరకలేదు. కానీ, ఒక రాయి దొరికింది. రాయిని చేతిలోకి తీసుకున్న ఆ రైతు…సింహం వైపు చూస్తూ నడుస్తున్నాడు.. ఆ క్షణంలోనే ఆ సింహం ఆవును వదిలి అడవి వైపు పరుగెత్తింది.
ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ. ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ
— Vivek Kotadiya🇮🇳 BJP (@VivekKotdiya) June 29, 2023
ఈ వీడియోను జూన్ 29న @VivekKotdiya అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గిర్ సోమనాథ్ జిల్లాలోని అలీదార్ గ్రామంలో సింహరాశి ఆవుపై దాడి చేసినప్పుడు, ఆ రైతు తన ఆవును రక్షించడంలో విజయం సాధించాడని క్యాప్షన్‌లో రాశారు.. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. లైక్‌లు కూడా బాగా వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..